LIC Scheme: సమయం లేదు మిత్రమా..! ఎల్‌ఐసీ వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి 31 చివరి అవకాశం

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే మోడీ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి వయ వందన యోజన ఒకటి. ఇది పెన్షన్ స్కీమ్. దీని కింద పెట్టుబడిదారులు..

LIC Scheme: సమయం లేదు మిత్రమా..! ఎల్‌ఐసీ వినియోగదారులకు అలర్ట్‌.. మార్చి 31 చివరి అవకాశం
Lic Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Mar 30, 2023 | 9:19 PM

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే మోడీ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి వయ వందన యోజన ఒకటి. ఇది పెన్షన్ స్కీమ్. దీని కింద పెట్టుబడిదారులు ప్రతి నెల హామీతో కూడిన రాబడి భద్రతను పొందుతారు. ఈ పథకం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేయబడుతోంది. మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీకు మార్చి 31 వరకు మాత్రమే సమయం ఉంది. వాస్తవానికి, ఈ పథకం గడువును పొడిగించేందుకు ఎల్‌ఐసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటువంటి పరిస్థితిలో ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఒక రోజు మాత్రమే మిగిలిఉంది.

వయ వందన యోజన అంటే ఏమిటి?

ప్రధాన మంత్రి వయ వందన యోజన ఒక సామాజిక భద్రతా పథకం. దీని కింద దరఖాస్తుదారునికి వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిబంధన ఉంది. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) నిర్వహిస్తుంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ పథకంలో అర్హులు. ఈ పథకం కింద వారు గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు ఈ పథకంలో కేవలం రూ. 7.5 లక్షలు మాత్రమే ఉండేది. తర్వాత ఈ మొత్తాన్ని డబుల్‌ చేసింది కేంద్రం. ఈ ప్లాన్‌పై సీనియర్ సిటిజన్‌లు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

  1. పెన్షన్‌ మొత్తం పెట్టుబడి మీదే ఆధారం: ప్రధాన మంత్రి వయ వందన యోజన అత్యంత ప్రత్యేక విషయం ఏమిటంటే, ఇందులో మీరు ప్రతి నెలా కనీస పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. పెన్షన్ మొత్తం పెట్టుబడి మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పథకం కింద రూ.1,000 నుంచి రూ.9,9,250 వరకు పెన్షన్ పొందవచ్చు. మరోవైపు భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో పెట్టుబడి పెడితే వారు రూ.18,300 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.
  2. ఈ పథకంలో పెట్టుబడి పరిమితి రూ. 1.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే నెలవారీగా రూ.1,000 పెన్షన్ వస్తుంది. అదే సమయంలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం రూ. 9,250 పెన్షన్ మొత్తం అందుతుంది. మరోవైపు భార్య, భార్య ఇద్దరూ కలిసి పెట్టుబడి పెడితే మొత్తం రూ.30 లక్షల పెట్టుబడి ద్వారా నెలవారీ రూ.18,300 పెన్షన్ పొందవచ్చు. మీరు ఈ పెన్షన్‌ను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా పొందుతారు. ఈ పథకంలో మొత్తం 10 సంవత్సరాల పాటు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. మార్చి 31, 2023 తర్వాత పెట్టుబడి పెట్టలేరు: ఈ పథకం గడువు మార్చి 31, 2023తో ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చివరి అవకాశం. ఎల్‌ఐసీ ఈ అద్భుతమైన పాలసీ ఏప్రిల్ 1 నుంచి మూసివేయబడుతుంది. దీన్ని ఎల్‌ఐసీ మే 4, 2017న ప్రారంభించింది.
  5. పథకంలో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు: మీరు ప్రధాన్ మంత్రి వయ వందన యోజనలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఏదైనా ఎల్‌ఐసీ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టడం కూడా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. పథకం మెచ్యూరిటీకి ముందు ఒక వ్యక్తి మరణిస్తే, ఆ పెట్టుబడిదారుడి డబ్బు నామినీకి అందజేస్తారు.
  6. ఆదాయపు పన్ను: ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80-C కింద పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, పాలసీదారు డిపాజిట్ చేసిన మొత్తం నుంచి వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
  7. వడ్డీ: మీరు ప్రతి నెలా పెన్షన్ పెంచాలనుకుంటే, మీకు 8 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు సంవత్సరానికి ఒకసారి మొత్తం పెన్షన్ మొత్తాన్ని పెంచాలనుకుంటే, ఈ వడ్డీ 8.3 శాతానికి పెరుగుతుంది.
  8. ఎలాంటి పత్రాలు అవసరం: ప్రధాన్ మంత్రి వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టడానికి, మీరు ఫారమ్‌తో పాటు కింది పత్రాలను సమర్పించాలి. పాన్‌కార్డు కాపీ, అడ్రస్ ప్రూఫ్ కాపీ (ఆధార్, పాస్‌పోర్ట్ మొదలైనవి), చెక్కు కాపీ లేదా బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ.

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!