Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund: మీరు మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టరా..? మార్చి 31లోపు ఈ పని పూర్తి చేసుకోండి.. లేకుంటే ఇబ్బందే

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మార్చి 31 తేదీ చాలా ముఖ్యమైనది. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఇంకా నామినేషన్ పనిని పూర్తి చేయకపోతే..

Mutual Fund: మీరు మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టరా..? మార్చి 31లోపు ఈ పని పూర్తి చేసుకోండి.. లేకుంటే ఇబ్బందే
Mutual Fund
Follow us
Subhash Goud

|

Updated on: Mar 22, 2023 | 2:54 PM

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మార్చి 31 తేదీ చాలా ముఖ్యమైనది. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఇంకా నామినేషన్ పనిని పూర్తి చేయకపోతే వెంటనే పూర్తి చేసుకోండి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తన సూచనలలో అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలను మార్చి 31 లోపు తమ పెట్టుబడిదారులందరి నామినేషన్ పనులను పూర్తి చేయాలని కోరింది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పెట్టుబడిదారులు నామినేషన్‌ను పూర్తి చేయడానికి గడువు మార్చి 31, 2023. ఈ నోటిఫికేషన్‌ను మార్కెట్ రెగ్యులేటర్ జూన్ 2022లో మాత్రమే జారీ చేసింది.

నామినేషన్ వేయకపోతే నష్టమే..

ఈ నోటిఫికేషన్‌లో నామినేషన్ పూర్తికాని పక్షంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో నిలిచిపోతుందనిసెబీ తెలిపింది. దీని తర్వాత వివరాలను సమర్పించిన తర్వాత మాత్రమే మళ్లీ యాక్టివేట్ చేయబడుతుంది. అటువంటి పరిస్థితిలో గడువులోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం.

మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్ ఎందుకు..?

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నామినేషన్‌ను పూర్తి చేయమని సెబీ కోరుతోంది. ఎందుకంటే పథకం మెచ్యూరిటీకి ముందే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మరణిస్తే దాని ఆస్తులను బదిలీ చేయడం కష్టం. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో సెబీ నామినేషన్ తప్పనిసరి చేసింది.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ:

మ్యూచువల్ ఫండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నామినేషన్ పనిని పూర్తి చేయవచ్చు. సాధారణంగా ఉమ్మడి పోర్ట్‌ఫోలియోలో నామినేషన్‌లో చాలా సమస్యలు కనిపిస్తాయి. ఈ సందర్భంలో మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నామినేషన్‌ను పూర్తి చేయడానికి మీరు మ్యూచువల్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దాన్ని పూర్తి చేయవచ్చు. అదే సమయంలో ఆఫ్‌లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. కానీ కొన్నిసార్లు ఈ పని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌