Income Tax: ఫారం 16 గురించి తెలుసా? దీనిని ఎందుకు తీసుకుంటారు? పూర్తి తెలుసుకోండి..
ప్రతి సంస్థ తమ ఉద్యోగులకు ఆర్థిక సంవత్సరం చివర్లో ఫామ్ 16 ని అందిస్తుంది. ఉద్యోగి పక్షంగా సంస్థ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ డిడక్టెట్ ఎట్ సోర్స్(టీడీఎస్) కు ఇది ఒక ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది.
ఫారం 16.. ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేసే వారికి అవసరమైన అన్ని ప్రాధాన్య అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి సంస్థ తమ ఉద్యోగులకు ఆర్థిక సంవత్సరం చివర్లో ఫారం 16 ని అందిస్తుంది. ఉద్యోగి పక్షంగా సంస్థ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ డిడక్టెట్ ఎట్ సోర్స్(టీడీఎస్) కు ఇది ఒక ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. మరోలా చెప్పాలంటే ఉద్యోగి ఇన్‌కమ్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్), ఇతర సమాచారం గురించి పేర్కొంటూ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసే సర్టిఫికేట్. ఇది టీడీఎస్ ను మినహాయించినట్లు, ఉద్యోగి తరపున ప్రభుత్వ అధికారులకు డిపాజిట్ చేసినట్లు ధ్రువీకరిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఫారం 16 అంటే ఏమిటి? దానిలో ఏముంటాయి? దాని వల్ల ఉద్యోగికి ప్రయోజనం ఏమిటి? సంస్థకు మేలేంటి? తెలుసుకుందాం..
రెండు రకాలుంటాయి..
ఫారం 16లో ఒకరు తమ ఆదాయపన్ను రిటర్న్‌ను సిద్ధం చేయడానికి, ఫైల్ చేయడానికి అవసరమైన సమాచారం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఆదాయం, పనిచేస్తున్న సంస్థ తీసివేసిన టీడీఎస్ మొత్తాన్ని చూపుతుంది. ఫారం 16లో పార్ట్ ఎ, పార్ట్ బి అనే రెండు భాగాలు ఉన్నాయి.
ఫారం 16లోని పార్ట్ ఏ (ఫారం 16ఏ).. ఫారమ్ 16ఏ త్రైమాసికంలో తీసివేసిన, డిపాజిట్ చేసిన టీడీఎస్ వివరాలు, పనిచేస్తున్న సంస్థ పాన్., TAN వివరాలు, ఇతర సమాచారాన్ని అందిస్తుంది. యజమాని ట్రేసెస్ పోర్టల్ ద్వారా ఫారం 16లో ఈ భాగాన్ని రూపొందించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు మారే ఉద్యోగులు, ప్రతి సంస్థ నుంచి విడిగా ఉద్యోగ కాలానికి సంబంధించి ఫారం 16 తీసుకోవాలి. దీనిలో ఉద్యోగి పాన్ నంబర్ కూడా ఉంటుంది.
ఫారం 16లోని పార్ట్ బీ(ఫారం 16బీ).. ఇది పార్ట్ ఏ కి అనుబంధంగా ఉంటుంది. ఇది సంస్థ తమ ఉద్యోగుల కోసం సిద్ధం చేస్తుంది. ఇది ఆదాయపన్ను చట్టంలోని చాప్టర్ VI-A కింద ఆమోదం పొందిన జీతం, డిడక్షన్స్‌ను పేర్కొంటుంది.సెక్షన్ 10 కింద మినహాయింపు పొందిన అలవెన్సుల వివరణాత్మక విభజన, అధ్యాయం VI-A కింద తగ్గింపుల వివరాలు ఉంటాయి.
ఫారం 16 అవసరం ఏంటి?
ఆదాయ పన్ను రిటర్నులను సులభంగా ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరం. యజమాని జీతం నుంచి టీడీఎస్గా తీసివేసిన డబ్బును అధికారులకు సమర్పించినట్లు ఇది రుజువు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీరు చేసిన పెట్టుబడి ప్రకటనల ఆధారంగా పన్నుల గణన వివరాలను కూడా అందిస్తుంది.
ఫారం 16 పొందేందుకు ఎవరు అర్హులంటే..
ఓ ఉద్యోగి తాను పనిచేస్తున్న సంస్థ నుంచి జీతంగా అతనికి అందే మొత్తంపై టీడీఎస్ చెల్లిస్తుంటే అతను ఫారం 16 అర్హుడు. అలాగే ఒకవేళ వ్యక్తి పన్ను మినహాయింపు పొందే కేటగిరీ కిందకు వచ్చినప్పటికీ, వారి సంస్థ పన్ను మినహాయింపులు చేసినట్లయితే, అతను/ఆమె ఐటీఆర్ ఫారం16 ను జారీ చేయాలి.
ఫారం 16ను ఎలా డౌన్ లోడ్ చేస్తారు..
- ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.
- ‘ఫారంలు/డౌన్‌లోడ్’ విభాగంలోని ‘ఆదాయ పన్ను ఫారం’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- పీడీఎఫ్ లేదా పూరించదగిన ఫారమ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.
- ఫారం డౌన్‌లోడ్ చేయడానికి ‘పీడీఎఫ్’పై క్లిక్ చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..