Rama Navami 2023: రామనవమి రోజున అరుదైన యోగాలు.. ఆ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే..

హిందూ మతం ప్రకారం చాలా మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. ప్రజలు ఆయా దేవతలందరినీ పూజిస్తారు. ఇక ఏటా పండుగలు కూడా వస్తూనే ఉంటాయి. ఇక శ్రీరాముని అనుగ్రహం పొందాలనుకునే భక్తులకు.. ఆయనను పూజించడానికి రామ నవమి అత్యంత పవిత్రమైన రోజు. పంచాగం ప్రకారం, చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి నాడు రామ నవమిని జరుపుకుంటారు.

Rama Navami 2023: రామనవమి రోజున అరుదైన యోగాలు.. ఆ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే..
Zodiac SignImage Credit source: TV9 Telugu
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Mar 30, 2023 | 9:15 AM

హిందూ మతం ప్రకారం చాలా మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. ప్రజలు ఆయా దేవతలందరినీ పూజిస్తారు. ఇక ఏటా పండుగలు కూడా వస్తూనే ఉంటాయి. ఇక శ్రీరాముని అనుగ్రహం పొందాలనుకునే భక్తులకు.. ఆయనను పూజించడానికి రామ నవమి అత్యంత పవిత్రమైన రోజు. పంచాగం ప్రకారం, చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి నాడు రామ నవమిని జరుపుకుంటారు. ఏడాది శ్రీరామనవమి మార్చి 30న వచ్చింది. అయితే, ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. అరుదైన యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగనున్నాయి. మరి ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ యోగాలేంటి?

పండితులు ప్రకారం.. రామ నవమి నాడు అమృత సిద్ధి యోగం, గురు పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు మూడు రాశులను ప్రభావితం చేస్తాయి. విశేషమేమిటంటే మార్చి 30న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.59 గంటల వరకు అమృత సిద్ధి యోగం, సర్వార్థసిద్ధి యోగం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సింహరాశి..

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఈ యోగం సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శ్రీరాముడి దయతో విజయం సాధిస్తారు. అప్పుల నుండి కూడా విముక్తి పొందుతారు. అనేక ఆదాయ మార్గాలు అందివస్తాయి. వ్యాపారం, ఉద్యోగాలలో మంచి వృద్ధి ఉంటుంది.

తులారాశి..

తుల రాశి వారికి రామ నవమి చాలా మంచి జరుగుతంది. ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహం కాని వారికి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే బలంగా ఉంటుంది. మీ కీర్తి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది.

వృషభం..

రామ నవమి రోజు వృషభ రాశి వారికి అదృష్టం తలుపులు తడుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ రోజున చేయవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..