Ukraine Students: ఉక్రెయిన్‌ మెడికల్ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఎంబీబీఎస్‌ పూర్తి చేసేందుకు అవకాశం.

యుక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై ఎంతలా ప్రభావం చూపిందో అక్కడ వైద్య విద్యనభ్యసించిన మన విద్యార్థులపై ప్రభావం చూపింది. యుద్ధం కారణంగా భారత్ నుంచి యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల్లో చాలా మంది గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి వచ్చిన విషయం..

Ukraine Students: ఉక్రెయిన్‌ మెడికల్ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఎంబీబీఎస్‌ పూర్తి చేసేందుకు అవకాశం.
Ukraine Mbbs Students
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 28, 2023 | 6:00 PM

యుక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై ఎంతలా ప్రభావం చూపిందో అక్కడ వైద్య విద్యనభ్యసించిన మన విద్యార్థులపై ప్రభావం చూపింది. యుద్ధం కారణంగా భారత్ నుంచి యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లిన విద్యార్థుల్లో చాలా మంది గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఆప‌రేష‌న్ గంగ’’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలలో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చింది. అయితే ఎంబీబీఎస్‌ పూర్తవ్వకముందే స్వదేశానికి తిరిగొచ్చిన విద్యార్థుల భవితత్వం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ను క్లియర్‌ చేయడానికి అవకాశాన్ని కల్పించింది. థియరీతో పాటు ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ను ఒకేసారి పూర్తి చేసేలా అవకాశం కల్పించనున్నట్లు మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఏడాదిలో ప్రాక్టికల్, థియరీ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ మెడికల్‌ కాలేజీల్లోనూ ఎన్‌రోల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ రెండు పరీక్షలను పూర్తి చేసిన విద్యార్థులు.. భారత్ లో రెండేళ్ల రోటరీ ఇంటర్న్‌షిప్‌పు కచ్చితంగా చేయాలని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే మొదటి ఏడాది ఇంటర్నషిప్‌ ఉచితంగా చేయాల్సి ఉంటుంది. రెండో ఏడాది స్టైఫండ్‌ చెల్లించనున్నట్లు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ మెడికల్‌ కాలేజీలో ఎన్‌రోల్‌ కావాల్సిన అవసరం లేకుండా ఎంబీబీఎస్‌ పరీక్షలను పూర్తి చేసే అవకాశం కల్పించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!