IT Rules: ఇంట్లోనే డబ్బు దాచుకుంటున్నారా? ఈ ఐటీ నిబంధనలు తెలుసుకోకపోతే మొత్తం కోల్పోతారు..

ఇప్పటికీ ఇళ్లలోనే లిక్విడ్ క్యాష్ దాచుకొనే వారు చాలా మంది ఉంటారు. అయితే మన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేస్తే ఏమవుతుందో తెలుసా? అసలు ఎంత మొత్తం వరకూ ఇంట్లో నగదు నిల్వ చేయవచ్చు? ఇన్ కమ్ ట్యాక్స్ వారికి మన దగ్గర ఉన్న నగదు విషయాలు ఎలా తెలుస్తాయి?

IT Rules: ఇంట్లోనే డబ్బు దాచుకుంటున్నారా? ఈ ఐటీ నిబంధనలు తెలుసుకోకపోతే మొత్తం కోల్పోతారు..
Cash
Follow us
Madhu

|

Updated on: Mar 26, 2023 | 5:00 PM

ప్రస్తుతం అంతా డిజిటల్ ట్రెండ్ నడుస్తోంది. క్రయ, విక్రయాలు, ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల ఆవిర్భావంతో లావాదేవీలన్నీ డిజిటల్ రూపం సంతరించుకున్నాయి. దీంతో ఇంట్లో నగదు దాచుకొనే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లలోనే ఎక్కువగా దాచుకుంటున్నారు. అవసరమైనప్పుడు ఇలా ఇన్ స్టంట్ గా ఫోన్ నుంచే లావాదేవీలు జరుపుకొంటున్నారు. అయితే ఇప్పటికీ ఇళ్లలోనే లిక్విడ్ క్యాష్ దాచుకొనే వారు చాలా మంది ఉంటున్నారు. అయితే మన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేయవచ్చా? అసలు ఎంత మొత్తం వరకూ ఇంట్లో నగదు నిల్వ చేయవచ్చు? ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం వారికి మన దగ్గర ఉన్న నగదు విషయాలు ఎలా తెలుస్తాయి? తెలుసుకుందాం రండి..

పరిమితి ఉంది.. లెక్క చెప్పాల్సిందే..

ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం.. మీరు మీ ఇంట్లో ఉంచుకోదగిన నగదుకు ఒక పరిమితి ఉంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు నగదును వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ, ఎవరైనా భారీగా నగదు నిల్వ చేసి దర్యాప్తు సంస్థకు పట్టుబడితే, ఆ నగదు తన దగ్గరకు ఎలా వచ్చిందన్న అన్ని ఆధారాలను సంబంధిత వ్యక్తి అధికారులకు సమర్పించాలి. ఆ డబ్బును అతను సరైన మార్గంలో సంపాదించినట్లయితే, దానికి సంబంధించి పూర్తి ధ్రువపత్రాలను కలిగి ఉండాలి. లేకుంటే రూ. 20 లక్షల వరకు జరిమానా విధించే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంది.

వారు చూస్తూనే ఉంటారు..

మీరు చేసే ప్రతి లావాదేవీపై ఈడీ, సీబీఐ నిఘా కన్ను ఉంటుంది. ఆయా లావాదేవీలపై పాన్ కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా ఆదాయపు పన్ను శాఖ నిత్యం మానిటర్ చేస్తుంది. నగదు మొత్తాన్ని బట్టి ఐటీ విభాగమే కాక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వంటివి సైతం సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, పట్టుబడిన డబ్బును సరైన మార్గంలో సంపాదించినట్లు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత సదరు వ్యక్తిదేనని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

భారీగా జరిమానా..

లెక్కల్లో చూపని నగదు ఇంట్లో పట్టుబడితే బారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సబీడీటీ) ప్రకారం ఆ డబ్బు మూలాన్ని చెప్పలేకపోతే 137 శాతం ఫైన్ విధించవచ్చు. వాటికి సంబంధించిన ఐటీ రిటర్నులు ఫైల్ చేసినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. నగదు లావాదేవీల గురించి పరిమితులు ఎలా ఉన్నాయంటే..

ఇవి గుర్తుంచుకోండి..

  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే జరిమానా విధించవచ్చు. అదే మొత్తాన్ని డిపాజిట్ చేసే పక్షంలో పాన్, ఆధార్ సమాచారాన్ని అందించడం తప్పనిసరి.
  • ఒకేసారి రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా విత్‌ డ్రా చేయడానికి పాన్ నంబర్ ఇవ్వాలి.
  • రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదుతో షాపింగ్ చేయలేరు. ఒకవేళ కొనుగోళ్లు జరిపితే పాన్, ఆధార్ ఇవ్వాల్సిందే.
  • రూ. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం జరిపితే, సదరు వ్యక్తి దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలోనికి వచ్చే అవకాశం ఉంది.
  • క్రెడిట్-డెబిట్ కార్డ్ కార్డ్ చెల్లింపు సమయంలో, లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వ్యక్తిని విచారణ చేయవచ్చు.
  • ఒక రోజులో బంధువుల నుంచి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోలేరు. ఇది కూడా బ్యాంకు ద్వారా జరగాల్సి ఉంటుంది. నగదు రూపంలో ఇచ్చే విరాళాల పరిమితిని రూ. 2 వేలుగా, వ్యక్తుల నుంచి తీసుకునే రుణాలను రూ. 20 వేలుగా నిర్ణయించారు. బ్యాంకు నుంచి 2 కోట్ల కంటే ఎక్కువ నగదు విత్‌ డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..