- Telugu News Photo Gallery Hero splendor bikes most popular best mileage among other, here are the price details
Top Bikes: సంక్రాంతికి కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధర, అదిరిపోయే మైలేజ్ ఈ బైక్‌ల సొంతం..
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 బైక్‌లలో ఒకటి 'హీరో స్ప్లెండర్' బైక్స్. ఈ బైక్స్‌కు సంబంధించి వివిధ మోడల్స్ అందుబాటులో ఉండగా..
Updated on: Jan 13, 2023 | 1:53 PM

ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 బైక్‌లలో ఒకటి 'హీరో స్ప్లెండర్' బైక్స్. ఈ బైక్స్‌కు సంబంధించి వివిధ మోడల్స్ అందుబాటులో ఉండగా.. వాటిల్లో చౌకైనది హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ 97.2సీసీ ఇంజిన్‌తో వస్తోంది. అలాగే ఈ బైక్‌కు సంబంధించిన వివిధ వేరియంట్‌ల రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్ మంచి మైలేజ్ ఇస్తోంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.71,176 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 4 వేరియంట్లు, 9 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.73,496గా ఉంది.

స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్ అల్లాయ్ – రూ. 71,176కి, స్ప్లెండర్ ప్లస్ బ్లాక్, యాక్సెంట్ ఎడిషన్ – రూ. 72,496కి, స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్ అల్లాయ్ i3S – రూ. 72,496కి, స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్ అల్లాయ్ i3S మాట్టే షీల్డ్ గోల్డ్ - రూ. 73,496కి అందుబాటులో ఉన్నాయి.

ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లతో.. అలాగే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ స్ప్లెండర్ ప్లస్ బైక్‌కు అమర్చబడి ఉంది. స్ప్లెండర్ ప్లస్ బైక్ బరువు 112 కిలోలు కాగా, 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా 100 వంటి బైక్‌లతో పోటీపడుతుంది.

i3S వేరియంట్ హీరో 'ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్' ఫీచర్‌తో అందుబాటులో ఉంది. ఇది 5 సెకన్ల కంటే ఎక్కువ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు.. ఇంజిన్‌ను ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఈ సిస్టమ్ మెరుగైన మైలేజీని అందించడంలో సహాయపడుతుంది.




