Electric Vehicle: భారతీయ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌పై దృష్టి సారిస్తున్న ఐదు విదేశీ కంపెనీలు

టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు కొనసాగుతోంది. అయితే దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ కార్లు పెద్దగా సక్సెస్‌ కానీ విదేశీ కంపెనీలకు మరో అవకాశాన్ని కల్పిస్తోంది. మార్కెట్‌లో ఉన్న మారుతీ సుజుకి..

Electric Vehicle: భారతీయ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌పై దృష్టి సారిస్తున్న ఐదు విదేశీ కంపెనీలు
Electric Vehicle
Follow us
Subhash Goud

|

Updated on: Jun 15, 2023 | 6:55 PM

టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు కొనసాగుతోంది. అయితే దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ కార్లు పెద్దగా సక్సెస్‌ కానీ విదేశీ కంపెనీలకు మరో అవకాశాన్ని కల్పిస్తోంది. మార్కెట్‌లో ఉన్న మారుతీ సుజుకి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి స్థానిక కంపెనీల బలమైన పట్టును వదులుకోవడం అటువంటి కంపెనీలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ కార్ల కంపెనీలు ఇండియాలో రూ.30 వేల కోట్లకుపైగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయబోతున్నాయి.

ఎంజీమోటార్స్‌, నిస్సాన్‌, రెనాల్డ్‌, ఫోక్స్‌వ్యాగన్‌ వంటి కంపెనీలు భారత్‌లో పెట్రోలియం కార్ల ఉత్పత్తిని తగ్గించి ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్‌ సంస్థలు దేశంలోలగ్జరీ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో అనేక మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిలో ఆడి, జేఎల్‌ఆర్‌, వోల్వో కార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదు విదేశీ కంపెనీలు భారతీయ ఎలక్ట్రిక్‌ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

ఎంజీ మోటార్ నుంచి ఈవీ మోడళ్లు

అయితే ఎంజీ మోటార్ ప్రస్తుతం ఉన్న రెండు ఈవీలకు అదనంగా 4-5 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 5,000 కోట్ల ఇన్వెస్ట్‌తో భారత్‌లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా బ్యాటరీ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

రూ.20 వేల కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ మోటార్ ఈవీ ప్లాంట్

ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా భారతదేశంలో 20 వేల కోట్ల పెట్టుబడితో ఈవీ వాహనాల తయారీ కోసం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ 2032 నాటికి 1.78 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుందని నివేదికలు చెబుతున్నాయి.

వచ్చే ఏడాది వోక్స్‌ వ్యాగన్‌ నుంచి ఈవీ కారు

ఇక వోక్స్‌ వ్యాగన్‌ తన మొదటి ఈవీ కారును వచ్చే ఏడాది ఇండియన్‌ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక రేనాల్ట్‌-నిస్సాన్‌ ఇండియాలో పెట్రోల్‌ వాహనాలు పెద్దగా సక్సెస్‌ కానందున ఈ సంస్థ ఈవీ మోడళ్లను పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 5 వేల కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. రానున్న కాలంలో రెండు కొత్త ఈవీ మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి