AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: దేశంలో ఎన్ని రైళ్లలో కవచ్‌ సిస్టమ్ ఉంది? కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గుణపాఠం నేర్పింది. జూన్ 2న ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఇప్పటివరకు చాలా మృతదేహాలు పడి ఉన్నాయి. వాటిని..

Indian Railways: దేశంలో ఎన్ని రైళ్లలో కవచ్‌ సిస్టమ్ ఉంది? కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?
Indian Railways
Subhash Goud
|

Updated on: Jun 13, 2023 | 6:52 PM

Share

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గుణపాఠం నేర్పింది. జూన్ 2న ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఇప్పటివరకు చాలా మృతదేహాలు పడి ఉన్నాయి. వాటిని ఇంకా గుర్తించలేదు. సిగ్నలింగ్‌లో మెకానికల్ లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అదే సమయంలో ఈ ప్రమాదం తర్వాత భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కవచ్ సిస్టమ్ లేదని ప్రమాదం జరిగిన తర్వాత తెలిసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ భద్రతా వ్యవస్థను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే ఏ రైళ్లలో కవచ్‌ సిస్టమ్ ఉంది?

ఎన్ని రైళ్లలో కవచ్‌ సిస్టమ్ ఉంది?

భారతీయ రైల్వే రైళ్లలో కేవలం 2 శాతం మాత్రమే భద్రతా వ్యవస్థలను కలిగి ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పేర్కొంది. అయితే రైల్వే వర్గాల ప్రకారం.. రోజుకు 13169 ప్యాసింజర్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాయి. ఇందులో కవచ్‌ వ్యవస్థ కేవలం 65 లోకోమోటివ్‌లలో మాత్రమే ఉంది. 1445 కి.మీ పొడవైన మార్గంలో మొత్తం 134 స్టేషన్లు కవచ్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దక్షిణ-మధ్య రైల్వే జోన్‌లో మాత్రమే కవచ్‌ వ్యవస్థ ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రూట్లలో రైళ్లలో ఈ భద్రతా కవచాలు ఉంటాయి. మిషన్ రాఫ్తార్ కింద, ఢిల్లీ-ముంబై మెయిన్ లైన్, ఢిల్లీ-హౌరా మెయిన్ లైన్‌లో కవచ్‌ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసే పని కూడా జరుగుతోంది. వచ్చే ఏడాదిలోగా ఈ రక్షణ కవచం ఏర్పాటు పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి

భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన కవచ్‌ సిస్టమ్‌లో డ్రైవర్ లోపం, సిగ్నల్ సమస్యలు లేదా ఏదైనా ఇతర సాంకేతిక లేదా మెకానికల్ సమస్య కారణంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే, కవచ్‌ సిస్టమ్ స్వయంచాలకంగా బ్రేక్‌లను వర్తింపజేస్తుంది. ఈ సిస్టమ్‌లోని GPS, GPRS ఉపయోగించి సెన్సర్ ద్వారా రైలు ముందు ఇతర రైళ్ల ఉనికి లేదా కదలికను గుర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి