Aadhaar Update: నేడే చివరి రోజు, త్వరపడిండి..! ఉచితంగానే ఆధార్ ఆప్‌డేట్.. మార్పులు ఎలా చేసుకోవాలంటే..?

Aadhaar Update: దేశంలోని అందరి జీవితాల్లో భాగమైన ‘ఆధార్ కార్డ్’లోని తప్పులను ఉచితంగా మార్చుకునేందుకు బుధవారమే చివరి తేదీ. అవును, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూఐడీఏఐ సంస్థ ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి కల్పించిన..

Aadhaar Update: నేడే చివరి రోజు, త్వరపడిండి..! ఉచితంగానే ఆధార్ ఆప్‌డేట్.. మార్పులు ఎలా చేసుకోవాలంటే..?
Free Update for Aadhaar Card
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 14, 2023 | 5:40 AM

Aadhaar Update: దేశంలోని అందరి జీవితాల్లో భాగమైన ‘ఆధార్ కార్డ్’లోని తప్పులను ఉచితంగా మార్చుకునేందుకు బుధవారమే చివరి తేదీ. అవును, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూఐడీఏఐ సంస్థ ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి కల్పించిన అవకాశం ఈ రోజుతో ముగియనుంది. ఈ మేరకు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకొని, తప్పులు ఉంటే అప్‌డేట్ చేసుకోవాలి. అలాగే ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి అయినా ఆధార్‌ని అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న ఫ్రీ అప్‌డేట్ సదుపాయం ఈ రోజుతో ముగిసిపోతున్నందున.. ఇకపై ఆధార్‌లో మార్పులు చేయాలంటే రూ. 50 చెల్లించి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా ఈ బుధవారమే మీ ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోండి..

ఆధార్‌ అప్‌డేట్ ఎలా చేయాలంటే..

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ఎంటర్ చేసి లాగిన్‌ అవ్వాలి.
  • ఆపై ‘ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి.
  • అలా చేశాక మీకు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ నంబర్ ఎంటర్‌ చేసిన తర్వాత డాక్యుమెంట్‌ అప్‌డేట్‌పై క్లిక్‌ చేయాలి. అపుడు డీటెయిల్స్ కనిపిస్తాయి. అందులో సరిచేయాల్సిన వివరాలు సరిగ్గా నమోదు చేసుకొని నెక్స్ట్‌పై నొక్కాలి.
  • అనంతరం డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. అక్కడ డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ బటన్ క్లిక్‌ చేయాలి.
  • అప్పుడు మీకు 14 అంకెల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ వస్తుంది. అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.