Janasena Party: తెలంగాణలో జనసేన లక్ష్యమదే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్..
Pawan Kalyan: పవన్ వారాహిని ఏపీ నుంచి తెలంగాణలోకీ తీసుకెళ్లబోతున్నారు. డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని.. అక్కడ కూడా పోటీ ఉంటుందన్నారు పవన్. ఇక తనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలంతా మంగళగిరి వచ్చి అండగా నిలబడడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతోంది.
Pawan Kalyan: తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యమన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. తెలంగాణలో 26 నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారని.. వాళ్ల ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. అంతేకాదు.. తెలంగాణ, ఏపీలో కలిసి డిసెంబర్లో ఎన్నికలు జరగొచ్చని.. వారాహి టూర్ తెలంగాణలో కూడా ఉంటుందన్నారు.
ఇక పవన్ కల్యాణ్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మంగళగిరి పార్టీ ఆఫీసుకు వచ్చారు. మైత్రి మూవీస్ నుంచి వై.రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్మంట్ నుంచి డీవీవీ దానయ్య, మెగా సూర్యా ప్రొడక్షన్ నుంచి ఏఎం రత్నం, ఎస్వీసీసీ నుంచి బీవీఎస్ఎన్ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి శ్రీ వివేక్ కూచిభొట్లతోపాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌లు యాగశాలకు విచ్చేశారు. మహా యాగ నిర్వహణా నిమిత్తం వేద మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల వద్ద ఉంచిన మంత్ర కళశాలకు నమస్కరించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యం
* జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan సమావేశం
* 26 నియోజకవర్గాలకు బాధ్యుల నియామకం pic.twitter.com/NYgwDIvzSH
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
మరోవైపు జనసేనలోకి చేరికలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ SVCC ద్వారా టాలీవుడ్ లో అనేక విజయవంతమైన సినిమాలను అందించారు నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బీవీఎస్ఎన్ ప్రసాద్ పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న యాగంలో పాలుపంచుకున్నారు. అనంతరం పార్టీ కండువాను కప్పి జనసేన లోకి ఆహ్వానించారు పవన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..