- Telugu News Photo Gallery Adventure Travel: Follow these travelling tips makes your tour so adventurous
Adventure Travel: సాహసం అంటే ఇష్టమా..? అయితే ఇలా చేయండి.. మీ టూర్ అడ్వేంచరస్‌గా మారడం ఖాయం..
Adventure Travel: వేసవి కాలంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల వచ్చే థ్రిల్ వేరే లెవెల్. అయితే ముఖ్యంగా మీకు అడ్వెంజర్ టావెలింగ్ లేదా టూర్ అంటే ఇష్టం ఉన్నట్లయితే.. మీ కోసం కొన్ని ట్రావెలింగ్ టిప్ప్ చెప్పబోతున్నాం. వాటిని పాటిస్తే మీ టూర్ సాహసోపేతంగా మారుతుంది. ఆ చిట్కాలేమిటంటే..?
Updated on: Jun 13, 2023 | 5:07 AM

Adventure Travel: వేసవి కాలంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల వచ్చే థ్రిల్ వేరే లెవెల్. అయితే ముఖ్యంగా మీకు అడ్వెంజర్ టావెలింగ్ లేదా టూర్ అంటే ఇష్టం ఉన్నట్లయితే.. మీ కోసం కొన్ని ట్రావెలింగ్ టిప్ప్ చెప్పబోతున్నాం. వాటిని పాటిస్తే మీ టూర్ సాహసోపేతంగా మారుతుంది.

రాఫ్టింగ్: వేసవి కాలంలో రాఫ్టింగ్ అనేది చాలా పెద్ద సాహసమే. భారతదేశంలో మీరు రిషికేశ్‌లో రాఫ్టింగ్ ఆనందించవచ్చు. బోటింగ్ ఇష్టపడే వారికి కూడా ఒక గొప్ప ఎంపిక ఉంది.

సైక్లింగ్: కొంతమందికి సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. సాహసాన్ని ఇష్టపడే వ్యక్తులు కొండ ప్రాంతాల్లో సైక్లింగ్ చేయడానికి ఇష్టపడతారు. సైకిల్‌పై సరదాగా భారతదేశం మొత్తం తిరిగినవారు కూడా లేకపోలేదుగా..

పారాగ్లైడింగ్: ఆకాశంలో విహరించాలన్న కల అ పారాగ్లైడింగ్‌తో నెరవేరుతుంది.హిమాచల్‌లోని బిర్ బిల్లింగ్ ప్రపంచంలోనే రెండవ ఎత్తైన పారాగ్లైడింగ్ ప్రదేశం, ఇంకా ఆసియాలో అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి.

క్యాంపింగ్: కొంతమందికి సాహసోపేతమైన రాత్రులు అంటే చాలా ఇష్టం. ఎవరెస్ట్ పర్వతం వంటి ఎత్తైన శిఖరాలపై క్యాంపింగ్ చేయడానికి ఇష్టపడటానికి ఇదే కారణం. అయితే ఈ రోజుల్లో ఇలాంటి అనేక క్యాంపింగ్ స్పాట్‌లు ఉన్నాయి. వాటిని సందర్శించి మీ టూర్‌ని అడ్వెంజరస్‌గా మార్చుకోండి.




