WI vs IND 2023: టీమిండియా వెస్టిండీస్ టూర్.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..
West Indies Tour: ప్రపంచకప్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిపోయింది. ఆసీస్ ముందు తేలిపోయినా టీమిండియా.. ఈ ఏడాది జులై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే తన విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆతిథ్య జట్టుతో..
West Indies Tour: ప్రపంచకప్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిపోయింది. ఆసీస్ ముందు తేలిపోయినా టీమిండియా.. ఈ ఏడాది జులై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే తన విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆతిథ్య జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. సోమవారం బీసీసీఐ చేసిన ట్వీట్‌లో విండీస్‌లో భారత్ ఆడే అన్నీ మ్యాచ్‌ల వివరాలు ఉన్నాయి.
వెస్టిండీస్- భారత్ సిరీస్ పూర్తి షెడ్యూల్
? NEWS ?
2️⃣ Tests 3️⃣ ODIs 5️⃣ T20Is
Here’s the schedule of India’s Tour of West Indies ?#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
- 1వ టెస్ట్: జూలై 12-16, విండ్సర్ పార్క్, డొమినికా
- 2వ టెస్ట్: జూలై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్
- 1వ ODI: జూలై 27, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
- 2వ వన్డే: జూలై 29, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
- 3వ వన్డే: ఆగస్టు 1, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
- 1వ T20: ఆగస్టు 3, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
- 2వ T20: ఆగస్టు 6, నేషనల్ స్టేడియం, గయానా
- 3వ T20: ఆగస్టు 8, నేషనల్ స్టేడియం, గయానా
- 4వ T20: ఆగస్టు 12, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా
- 5వ T20: ఆగస్టు 13, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా
కాగా, ఐపీఎల్ 16వ సీజన్ తరహాలోనే వెస్టిండీస్ టూర్ మ్యాచ్‌లను కూడా ఉచితంగానే లైవ్ స్ట్రీమింగ్ చేస్తామని ఇటీవల జీయో సినిమా ప్రకటించింది. ఐపీఎల్ 16వ సీజన్‌లోని తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు లైవ్ స్ట్రీమింగ్‌ని జియో సినిమా ఉచితంగానే అందించిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..