AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2023: గిల్ వివాదాస్పద ఔట్‌పై రోహిత్ ఫ్రస్ట్రేట్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..

WTC Final 2023: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ చివరి రోజుకు చేరుకుంది. ఇక నాల్గో రోజు శుభమాన్ గిల్(18) క్యాచ్‌ఔట్‌పై సందేహాలు, చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే క్యాచ్‌ఔట్ రివ్యూపై ఔట్ అంటూ థర్ట్‌ అంపైర్ ప్రకటించగానే..

WTC Final 2023: గిల్ వివాదాస్పద ఔట్‌పై రోహిత్ ఫ్రస్ట్రేట్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..
Rohit Reaction On Gill’s Out
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 11, 2023 | 8:26 AM

Share

WTC Final 2023: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ చివరి రోజుకు చేరుకుంది. ఇక నాల్గో రోజు శుభమాన్ గిల్(18) క్యాచ్‌ఔట్‌పై సందేహాలు, చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే క్యాచ్‌ఔట్ రివ్యూపై ఔట్ అంటూ థర్ట్‌ అంపైర్ ప్రకటించగానే నాన్ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్‌ ఒక్కసారిగా షాక్‌తో నో అంటూ అరిచాడు. అలాగే ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో కూడా చర్చించాడు, కానీ గిల్ వెనుదిరగక తప్పలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అంతకముందు భారత్‌పై 443 పరుగుల ఆధిక్యంతో మూడో ఇన్నింగ్స్‌ని ఆసీస్ డిక్లేర్ చేసింది. అలా విజయం కోసం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్, గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. అయితే స్కాట్ బోలాండ్ వేసిన బంతిని ఆడిన గిల్.. వివాదాస్పద క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.

ఇవి కూడా చదవండి

కాగా, నాల్గో రోజు ఆట ముగిసేసికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి (44), రహానే(20)ఉన్నారు. ఇక ఆఖరి రోజు విజయం కోసం భారత్‌కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్‌ గెలిచేందుకు 7 వికెట్లు అవసరం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..