Vivo Smartphone: వీవో నుంచి అదిరిపోయే 5జీ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు.. ధర, ఫీచర్ల వివరాలివే..

Vivo Y78 5G: భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దశాబ్ద కాలపు చరిత్ర కలిగిన  Vivo తన కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తుంటుంది. తన అద్భుతమైన ఫోన్లతో మార్కెట్‌లో మంచి ఆదరణను పొందగలిగింది. ఈ క్రమంలోనే వివో కంపెనీ భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం తన..

Vivo Smartphone: వీవో నుంచి అదిరిపోయే 5జీ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు.. ధర, ఫీచర్ల వివరాలివే..
Vivo Y78 5g
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 09, 2023 | 5:53 PM

Vivo Y78 5G: భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దశాబ్ద కాలపు చరిత్ర కలిగిన  Vivo తన కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తుంటుంది. తన అద్భుతమైన ఫోన్లతో మార్కెట్‌లో మంచి ఆదరణను పొందగలిగింది. ఈ క్రమంలోనే వివో కంపెనీ భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం తన Vivo Y78 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రాబోతోంది. మన దేశంలో Vivo Y78 5G స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్ నెలలో విడుదలవుతుందనే ప్రచారం జరగుతుండగా.. ఇప్పటికే చైనా మార్కెట్‌‌లో రాణిస్తున్న ఈ ఫోన్ ధర, ఫీచర్లు వంటి వివరాలు తాజాగా లీకయ్యాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Vivo Y78 5G ఫీచర్లు: 

ఇప్పటికే చైనాలో విడుదలైన Vivo Y78 5G ఫోన్‌లో 6.78-అంగుళాల కర్వ్‌డ్ ఎడ్జ్ OLED డిస్‌ప్లే, రిజల్యూషన్ ఫుల్ HD ప్లస్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. అయితే ఈ మోడల్‌లో 12/256GB, 8/256GB వేరియంట్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB వర్చువల్ ర్యామ్‌ని కూడా కలిగి ఉండడం విశేషం. అలాగే 5,000 mAh బ్యాటరీ బ్యాకప్, 44 W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ Android 13 ఆధారిత FunTouch OS 13 పై రన్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

Vivo Y78 5G కెమెరా విషయానికొస్తే.. దీని వెనుక భాగంలో OIS సప్పోర్ట్‌తో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2-ఎంపీ డెప్త్ కెమెరా, 2-ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16-ఎంపీ కెమెరా కూడా ముందుభాగంలో ఉంది. అలాగే సెక్యూరిటీ ఫీచర్‌గా ఫింగర్‌ప్రింట్ సెన్సార్(సైడ్) కూడా ఉంది.

భారత్‌లో Vivo Y78 5G ధర

డ్రీమీ గోల్డ్, ఫ్లేర్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌తో వస్తున్న ఈ Vivo Y78 5G ఫోన్ ధరను దాని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ ధర చైనాలో  8/256GB వేరియంట్‌ ధర CNY 1,699(సుమారు రూ. 20,100), 12/256GB వేరియంట్ ధర CNY 1,999(సుమారు రూ. 23,700)గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా