Telangana: మెడికల్ కాలేజీలతో తెలంగాణ రికార్డ్.. తాజాగా మరో కళాశాలకు అనుమతి.. శుభాకాంక్షలు తెలిపిన హరిష్ రావు..
Telangana: వైద్య విద్యలో తెలంగాణ మరో మైలురాయి చేరుకుందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చని సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన ఇది సంతోషించదగ్గ విషయన్నారు. హరీష్ రావ్ తన ట్వీట్‌లో..
Telangana: వైద్య విద్యలో తెలంగాణ మరో మైలురాయి చేరుకుందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన ఆయన ఇది సంతోషించదగ్గ విషయన్నారు. హరీష్ రావ్ తన ట్వీట్‌లో ‘కరీంనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల 100 ఎంబీబీఎస్ సీట్లతో ఆమోదం పొందడం ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ చేస్తున్న సంకల్పానికి నిదర్శనం. ఈ ఏడాది 9 అనుమతి పొందిన ప్రభుత్వ వైద్య కళాశాలలతో తెలంగాణ జాతీయ రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ స్థాపించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యంలో ఇది మరో ముందడుగు. తాజా అనుమతితో ఈ ఏడాది రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించి దేశ చరిత్రలోనే తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్‌లో మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి’ అని వెల్లడించారు.
అలాగే వైద్య విద్యార్థుల కోసం 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని, తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య కేవలం 5 కాగా, తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో 21 మెడికల్ కాలేజీలలు ఏర్పాటయ్యాయని.. ప్రస్తుతం తెలంగాణలోని మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరిందని పేర్కొన్నారు. ఇంకా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు స్పెషాలిటీ సేవలు చేరువ అవడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చేరువైందని హరీష్ రావు తెలిపారు.
Amazing news! Telangana reaches new heights in medical education!
Government Medical College, Karimnagar, has received approval with 100 MBBS seats, a testament to CM KCR’s commitment to one medical college in every district. Telangana sets a national record with 9 approved…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 7, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..