AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కిక్కు..లక్కు..లక్షలు హాంఫట్‌.. మందుబాబులకు యాప్‌ కాటు

మా యాప్ లో పెట్టుబడి పెట్టండి.. లక్షల రూపాయలు పొందడం.. ఉత్తుత్తి ప్రచారం కాదు నిజంగా నిజం 60 రోజుల్లోనే మీ డబ్బులు డబుల్ అవడం ఖాయం. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఓ యాప్ నిర్వహకులు చేసిన ప్రచారం. ఫలితంగా ఆ యాప్ ను నమ్మి పెట్టుబడి పెట్టిన వేల మంది డబ్బులు పోగొట్టుకుని బాదితులుగా మారిన పరిస్థితి. ఇంతకీ ఆ యాప్ ఏంటీ అందులో పెట్టుబడులు పెట్టి మోసం పోయిన బాదితుల గోడేంటి.

Telangana: కిక్కు..లక్కు..లక్షలు హాంఫట్‌..  మందుబాబులకు యాప్‌ కాటు
Grapes
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2023 | 9:38 PM

Share

ది వైన్ యాప్.. ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. కిక్ ఇస్తది.. లక్ వస్తది.  లక్షల్లో పని కాదు.. వందలూ వేలు చాలు… మంచిర్యాల జిల్లాలో ఇదే మాటలు విని వేలాది మంది డబ్బులు కట్టి ఇప్పుడు లబోదిబోమంటున్నారు ఎంతో మంది బాధితులు. ది వైన్ గ్రూప్ (TWG) పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ అయింది. వాటిని లోకల్ వాట్సాప్, ఇన్‌స్టా గ్రూపుల్లో లింకులు పెట్టి.. జనాల్ని ఆకర్షించారు. చైన్ సిస్టాన్ని క్రియేట్ చేసి యాప్‌లో జాయిన్ అయ్యేలా చేశారు. ఒక వైన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని నమ్మబలికారు.. కేవలం 3000 రూపాయలతో ఎంట్రీ అయితే చాలు.. రెండు నెలల్లో ఆ సొమ్ము మూడు రెట్లు అవుతుందని నమ్మబలికారు. రెట్టింపు ఆశతో రెచ్చిపోయి మరి వైన్‌యాప్‌లో లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. సడన్‌గా వైన్‌యాప్‌ కనుమరుగైంది. మద్యంబాబులకు కన్నీరు మిగిలింది.

దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ కింద దాదాపు 1.3 మిలియన్ మంది వినియోగదారులు ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే కాదు ఇటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోను వేలాది మంది ఈ నెట్వర్క్ కింద జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందెడ్ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున బాధితులు ఉన్నట్టుగా సమాచారం.

టీవీ9 కథనాలతో ది వైన్ యాప్ మోసాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫోకస్‌ పెట్టారు. యాప్ నిర్వహకులు.. వాట్సాప్ గ్రూపుల పై వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు మొదలైంది. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమను సంప్రదించాలని కోరారు పోలీసులు. తమను సంప్రదించే బాధితుల వివరాలు గోప్యంగా వుంచుతామని భరోసానిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ