AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh: ‘ఓ హీరో’ అంటూ రింకూ సింగ్ పోస్ట్‌పై గిల్ సోద‌రి కామెంట్‌.. వారి మధ్య అదే ఉందంటొన్న నెటిజన్లు..

Rinku Singh-Shahneel Gill: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవడంతో క్రికెటర్లంతా సొంతగూటికి చేరుకుని ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. కొందరు జాతీయ జట్టు షెడ్యూల్‌లో, మరి కొందరు దేశివాళీ క్రిెకెట్‌లో నిమగ్నమైపోగా....

Rinku Singh: ‘ఓ హీరో’ అంటూ రింకూ సింగ్ పోస్ట్‌పై గిల్ సోద‌రి కామెంట్‌.. వారి మధ్య అదే ఉందంటొన్న నెటిజన్లు..
Shubham Gill's Sister Shahneel Gill On Rinku Singh Post
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 06, 2023 | 8:42 PM

Share

Rinku Singh-Shahneel Gill: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవడంతో క్రికెటర్లంతా సొంతగూటికి చేరుకుని ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. కొందరు జాతీయ జట్టు షెడ్యూల్‌లో, మరి కొందరు దేశివాళీ క్రిెకెట్‌లో నిమగ్నమైపోగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్ రింకూ సింగ్ మాత్రం మాల్దీవుల్లో సేద తీరుతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుండడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అయితే తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ రింకూ సింగ్ చేసిన ఓ పోస్ట్‌పై.. తాజాగా శుభమాన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ స్పిందించింది. ‘ఓ హీరో.. ’ అంటూ రింకూ సింగ్ పోస్ట్‌కి కామెంట్ చేసింది. అంతే.. ఆమె చేసిన కామెంట్ స్క్రీన్ షాట్ రూపంలో సంచలనాత్మకంగా వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా.. శుభమాన్ గిల్, రింకూ సింగ్ మంచి స్నేహితులు కావడమే ఇందుకు కారణమని మరికొందరు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

రింకూ సింగ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Rinku ? (@rinkukumar12)

Gills Sister

రింకూ సింగ్ పోస్ట్‌పై షహ్నిల్ గిల్ కామెంట్..

కాగా, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లోకి రాకముందు శుభమాన్ గిల్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే శుభమాన్ గిల్, అతని సోదరి షహ్నిల్, నితీశ్ రాణా, రింకూ సింగ్ మంచి స్నేహితులు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ 16వ సీజన్‌లో కోల్‌కతా తరఫున రింకూ మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కోల్‌కతా విజయం కోసం చివరి ఓవర్లో 5 సిక్సర్లు కొట్టి సంచలనంగా మారాడు. అలాగే ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ మొత్తం 474 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..