AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Man vs Wild: కోహ్లీ, ప్రియాంక చోప్రాతో సాహస యాత్ర.. తర్వాతి ఎపిసోడ్‌లపై క్లారిటీ ఇచ్చేసిన ప్రపంచ ప్రఖ్యాత సాహసీకుడు.

‘Man vs Wild: ఇండియన్ క్రికెట్, సినిమా అభిమానులకు శుభవార్త.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా త్వరలో సహసం చేయబోతున్నారు. అవును, ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్‌’ సిరీస్‌‌లో తన తర్వాత ఎపిసోడ్ విరాట్ కోహ్లీతో చేయబోతున్నట్లు..

‘Man vs Wild: కోహ్లీ, ప్రియాంక చోప్రాతో సాహస యాత్ర.. తర్వాతి ఎపిసోడ్‌లపై క్లారిటీ ఇచ్చేసిన ప్రపంచ ప్రఖ్యాత సాహసీకుడు.
Priyanka Chopra; Bear Grylls; Virat Kohli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 06, 2023 | 6:30 PM

Share

‘Man vs Wild: ఇండియన్ క్రికెట్, సినిమా అభిమానులకు శుభవార్త.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా త్వరలో సహసం చేయబోతున్నారు. అవును, ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్‌’ సిరీస్‌‌లో తన తర్వాత ఎపిసోడ్ విరాట్ కోహ్లీతో చేయబోతున్నట్లు.. తన సాహసాలతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బేర్ గ్రిల్స్ స్వయంగా ప్రకటించాడు. అంతేకాక ప్రియాంక చోప్రాతో కూడా కలిసి ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు గ్రిల్స్ చెప్పుకొచ్చాడు.

గ్రిల్స్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీతో, ప్రియాంక చోప్రా స్ఫూర్తిదాయకమైన సెలబ్రిటీలు. వారికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్నందున వారి కథలు, ప్రయాణాల గురించి తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఆసక్తి చూపుతుంది. ముఖ్యంగా విరాట్ సాహసం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. కోహ్లీ నిజమైన సింహం. అలాగే ప్రియాంక చోప్రాతో అంటే నమ్మశక్యం కాని విషయం. ప్రియాంక భర్త(నిక్ జోనాస్)ని ఓ సారి తీసుకెళ్లాను’ అన్నాడు.

కాగా, ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండియన్ సినీ స్టార్స్ అక్షయ్ కుమార్, రజనీకాంత్, రన్వీర్ కపూర్, విక్కీ కౌషల్‌తో కలిసి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్‌’ ఎపిసోడ్‌ కోసం సాహస యాత్రలు చేశాడు బేర్ గ్రిల్స్. ఈ క్రమంలో కోహ్లీ, ప్రియాంకను కూడా తన సాహస యాత్రలో భాగం చేయాలనుకుంటున్నట్లుగా ప్రకటించాడు. దీనిపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇండియన్ నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..