Adipurush Second Trailer: ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది..

ప్రభాస్ అంటే ఒక రెబల్ స్టార్.. మాస్ హీరో.. ఒక బాహుబలి.. అలాంటి ప్రభాస్ ఇప్పుడేమో దేవుడుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదిపురుష్ కోసం ప్రభాస్ మేకోవర్ అభినందనీయం. మాస్ హీరో టూ మైథలాజికల్ కోసం ఎంతో మారిపోయారు.

Adipurush Second Trailer: ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది..
Adipurush Trailer
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 06, 2023 | 9:09 PM

ఓ హీరోకు ఉన్న ఇమేజ్‌ని.. 360 డిగ్రీస్ మార్చుకోవడం అంటే చిన్న విషయం కాదు.. ఇప్పుడు ప్రభాస్ ఇదే చేస్తున్నారు. ప్రభాస్ అంటే ఒక రెబల్ స్టార్.. మాస్ హీరో.. ఒక బాహుబలి.. అలాంటి ప్రభాస్ ఇప్పుడేమో దేవుడుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదిపురుష్ కోసం ప్రభాస్ మేకోవర్ అభినందనీయం. మాస్ హీరో టూ మైథలాజికల్ కోసం ఎంతో మారిపోయారు.

ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేసినపుడు.. ప్రభాస్ ఏంటి రాముడేంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కొత్త రాముడిని చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ ఉన్నారు కాబట్టే ఆదిపురుష్ మార్కెట్ ఇన్ని వందల కోట్ల వైపు అడుగులు వేస్తుందనడంలో సందేహం లేదు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదే క్రమంలో నేడు జరుగుతున్న ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్ లో సీతారాముల ప్రేమ కథను చూపించగా.. ఈ ట్రైలర్ లో పోరాట సన్నివేశాలను చూపించారు. రెండో ట్రైలర్ లో విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్ ను చూపించిన దర్శకుడి ప్రతిభ ఈ ట్రైలర్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.