AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash Dayal: ‘లవ్ జిహాద్’పై గుజరాత్ బౌలర్ వివాదాస్పద పోస్ట్.. ఆపై క్షమాపలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Yash Dayal on Love Jihad: దేశ రాజధాని ఢిల్లీలో సాహిల్ అనే వ్యక్తి సాక్షి అనే యువతిని హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ హత్య నేపథ్యంలో ‘లవ్ జిహాద్’ని ప్రస్తావిస్తూ గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్ చేసిన పోస్ట్ ఇప్పుడు వివాదంగా..

Yash Dayal: ‘లవ్ జిహాద్’పై గుజరాత్ బౌలర్ వివాదాస్పద పోస్ట్.. ఆపై క్షమాపలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Yash Dayal Post On Love Jihad
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 05, 2023 | 3:27 PM

Share

Yash Dayal on Love Jihad: దేశ రాజధాని ఢిల్లీలో సాహిల్ అనే వ్యక్తి సాక్షి అనే యువతిని హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ హత్య నేపథ్యంలో ‘లవ్ జిహాద్’ని ప్రస్తావిస్తూ గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్ చేసిన పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది. దయాల్ చేసిన పోస్ట్‌లో ‘లవ్ జిహాద్ లేనే లేదు, ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమే. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ వెనుక కత్తి పెట్టుకుని పైకి ప్రేమగా నటిస్తున్న ఓ ముస్లిం వ్యక్తి, కళ్లకు గంతలు కట్టి ఉన్న హిందూ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అతని మాటలకు బదులుగా ఆమె.. ‘నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలుసు అబ్దుల్, నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నా’ అంటూ సమాధానం చెబుతుంది. ఇంకా ఆ ముస్లిం యువకుడు అప్పటికే పలువురిని హత్య చేసినట్లుగా దయాల్ పోస్ట్‌లో ఉంటుంది.

అయితే దయాల్ పెట్టిన పోస్ట్ నెట్టింట వివాదంగా మారడంతో కొందరు నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ఇంకొందరు ‘దయాల్ పోస్ట్‌లో వాస్తవమే కదా ఉంది, అందులో తప్పుగా అతను ఏం లేని విషయాన్ని ప్రస్తావించలేదుగా..’ అంటున్నారు. అయితే తన పోస్ట్ వివాదంగా మారడంతో రియలైజ్ అయిన దయాల్ వెంటనే క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్ పెట్టాడు. అందులో ‘నేను ఆ పోస్ట్ అనుకోకుండా చేసింది. దయచేసి నాపై ద్వేషం చూపించకండి. నాకు అన్ని మతాలపై గౌరవం ఉంది’ అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా, దయాల్ క్షమాపణలు చెప్తూ చేసిన పోస్ట్‌పై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘తప్పు తెలుసుకోవడం సంతోషం ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా ఉండు’ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. ‘నువ్వు క్షమాపణలు చెప్పే అవసరం లేదు. జరుగుతున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పినందుకు నిజానికి నిన్ను అభినందించాలి’ అంటూ రాసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా దయాల్‌పై బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలని కొందరు హిందువులే డిమాండ్ చేయడం గమనార్హం.

యశ్ దయాల్ ఓవర్లో 5 సిక్సర్లు

నిజానికి ఐపీఎల్ 16వ సీజన్‌ టోర్నీ తొలి దశలో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌కి మధ్య జరిగిన మ్యాచ్‌కి ముందు దయాల్ గురించి ఎవరికి తెలియదు. అయితే కోల్‌కతా విజయం కోసం 28 పరుగులు చేయాల్సి ఉండగా ఆ టీమ్‌లోని రింకూ సింగ్.. దయాల్ వేసిన చివరి ఓవర్లో 5 సిక్సర్లు కొట్టాడు. అంతే క్రికెట్ ప్రపంచంలో యష్ దయాల్ పేరు ఓ సంచలనంగా మారింది. చెత్త బౌలర్ అంటూ సర్వత్రా వినిపించింది. ఆ చెత్త బౌలింగ్ ప్రదర్శన గురించి అంతా మరిచిపోకముందే దయాల్ ఇలా ‘లవ్ జిహాద్’ గురించి మాట్లాడడం నిజంగా మూర్ఖత్వమే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకా దయాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో మొహ్మద్ షమి, నూర్ అహ్మద్, రషిద్ ఖాన్ రూపంలో ముగ్గురు ముస్లిం వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ అతను ఇలా చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..