WTC Final 2023: ‘టీమిండియా ప్రిన్స్‌’పై ఆసీస్ లెంజెండ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చేస్తేనే అతన్ని అడ్డుకోగలరంటూ..

WTC Final 2023: ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కి ఇంకా 3 రోజులే మిగిలి ఉంది. ఎండో ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో..

WTC Final 2023: ‘టీమిండియా ప్రిన్స్‌’పై ఆసీస్ లెంజెండ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చేస్తేనే అతన్ని అడ్డుకోగలరంటూ..
Greg Chappell On Shubman Gill
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 04, 2023 | 3:45 PM

WTC Final 2023: ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కి ఇంకా 3 రోజులే మిగిలి ఉంది. ఎండో ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జూన్‌ 7 నుంచి 11 మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో.. ఇప్పటికే ఈ తొలి ఎడిషన్ ఫైనల్‌లో ఓడిన భారత్ ఈ సారి ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌గా నిలిచేందుకు తమకు దక్కిన తొలి అవకాశాన్ని ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతుంది.

అయితే ఆసీస్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోయే టీమిండియాలో ఐపీఎల్ సెంచరీలతో చెలరేగిన టీమిండియా ప్రిన్స్ శుభమాన్ గిల్, కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. ముఖ్యంగా గిల్ గతేడాది కాలంలో అన్ని ఫార్మట్లలోనూ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ బ్యాటింగ్‌ తీరుపై ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫామ్ మీదున్న గిల్‌ను ఎలా అడ్డుకోవాలో ఆసీస్ బౌలర్లకు కీలక సూచనలు చేశారు. ఎక్‌ష్ట్రా పేస్‌తో బంతులను సందిస్తేనే గిల్ ఇబ్బందిపడతాడని లేదంటే అతన్ని అడ్డుకోవడం కష్టమేనని పేర్కొన్నాడు.

చాపెల్ మాట్లాడుతూ ‘శుభమన్‌ గిల్ వంటి యువ క్రికెటర్లకు విదేశాల్లో ఆడేందుకు భారత్ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం అత్యుత్తమం. ఓవర్సీస్‌ పిచ్‌పై గిల్‌కు తగినంత అనుభవం ఉన్నా ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడం అతనికి కష్టమే. ఎక్‌ష్ట్రా పేస్‌తో బంతులను విసిరితే.. గిల్‌కి కష్టాలు తప్పవు. అసీస్ బౌలర్లు బౌన్స్‌తో బౌలింగ్‌ వేస్తే ఎంత మంచి బ్యాటర్‌ అయినా వెనుదిరగాల్సిందే. గిల్‌ని కట్టడి చేయాలంటే ఆసీస్ బౌలర్లు కొన్ని విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.ఆఫ్‌ స్టంప్‌ మీదగా ఎక్‌ష్ట్రా పేస్‌తో బౌలింగ్ చేస్తే గిల్‌ ఆడేందుకు ఇబ్బంది పడతాడు. ఒకవేళ బంతులు అదుపు తప్పితే మాత్రం గిల్‌ భారీ షాట్స్ ఆడుతాడు’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటివరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన గిల్.. 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 890 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..