AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2023: టెస్ట్ ఫైనల్‌లో కోహ్లీ దూకుడుని అడ్డుకోవడం కష్టమే..! మ్యాచ్‌కి ముందే విరాట్‌పై ఆసీస్ ఆల్‌రౌండర్ ప్రశంసలు..

WTC Final 2023: క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. అందరిలోనూ టీమిండియా..

WTC Final 2023: టెస్ట్ ఫైనల్‌లో కోహ్లీ దూకుడుని అడ్డుకోవడం కష్టమే..! మ్యాచ్‌కి ముందే విరాట్‌పై ఆసీస్ ఆల్‌రౌండర్ ప్రశంసలు..
Cameron Green On Virat Kohli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 04, 2023 | 2:28 PM

Share

WTC Final 2023: క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. అందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఆట మీదే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ సమయంలో ఇంగ్లాండ్‌లోనే కౌంటీ క్రికెట్ ఆడిన పుజారా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్ టోర్నీ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించిన వెంటనే కోహ్లీ కూడా లండన్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అంతేకాక ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేసి అదే దూకుడును కొనసాగించాలన్న తపనతో కింగ్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు.

అయితే ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తమ జట్టుపై ఎప్పుడూ ఉత్తమ ప్రదర్శన చేసే విరాట్.. ఐసీసీ టోర్నీల్లో ఇంకా దూకుడుగా ఆడతాడని, జట్టులో మానసిక స్థైర్యం నింపేలా అడుగులు వేస్తాడని గ్రీన్ పేర్కొన్నాడు. కీలక సమయంలో జట్టు నుంచి ముందుకు వచ్చే అతి కొద్ది క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడని కితాబిచ్చాడు. ఇంకా అద్భుతమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీ ఫైనల్‌కు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా విజయం కోసం ప్రయత్నిస్తామని, భారత బ్యాట్స్‌మెన్‌ని అడ్డుకునేందుకు కావలసిన ప్రణాళికలతో మైదానంలోకి దిగుతామని ధీమా వ్యక్తం చేశాడు.

కాగా, ఐపీఎల్‌‌లో ముంబై తరఫున తొలి మ్యాచ్ నుంచి క్వాలిఫయర్ 2 వరకు ఆడిన గ్రీన్ దాదాపు 2 నెలల పాటు టీ20 క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో తను టెస్ట్ ఆడబోవడం సవాలుతో కూడకున్న పనే అని, అయితే టెస్ట్ క్రికెట్‌కి మించిందేమీ లేదన్నాడు. ఇంకా డబ్ల్యూటీసీ ట్రోఫీ కోసం పొట్టి ఫార్మాట్‌ నుంచి టెస్టుల్లోకి త్వరగా మారిపోవాలని, ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ కామెరూన్ గ్రీన్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..