Wrestlers’ Protest: రెజ్లర్లకు అండగా 1983 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ బ్యాచ్‌.. ‘నాకు సంబంధం లేద’న్న కపిల్ దేవ్ సహచరుడు..

Wrestlers’ Protest: ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత రెజ్లర్ల నిరసనకు 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మద్ధతు తెలిపింది. ఈ మేరకు కపిల్ దేవ్ సారథ్యంలో అప్పటి భారత జట్టు ఆటగాళ్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారమవుతుందని ఈ ప్రకటనలో మాజీ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం..

Wrestlers’ Protest: రెజ్లర్లకు అండగా 1983 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ బ్యాచ్‌.. ‘నాకు సంబంధం లేద’న్న కపిల్ దేవ్ సహచరుడు..
83 Wc Team Members Support To Wresters‘ Protest
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 03, 2023 | 8:56 AM

Wrestlers’ Protest: ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత రెజ్లర్ల నిరసనకు 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మద్ధతు తెలిపింది. ఈ మేరకు కపిల్ దేవ్ సారథ్యంలో అప్పటి భారత జట్టు ఆటగాళ్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారమవుతుందని ఈ ప్రకటనలో మాజీ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్‌తో సహా పలువురు రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

కపిల్ దేవ్ 83 బ్యాట్ తన ప్రకటనలో చాంపియన్ రెజ్లర్లను ఇలాంటి పరిస్థితిలో చూడటం చాలా దారుణంగా ఉందని పేర్కొన్నారు. మన రెజ్లర్లకు ఈ పతకాలు అంత తేలికగా రాలేదని, ఇందుకోసం త్యాగంతో పాటు దేశం పట్ల అంకితభావం కూడా కనబరిచారని, అప్పుడే పతకం సాధించారని తెలిపారు. రెజ్లర్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తమ ప్రకటన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తమ పతకాలను గంగా నదిలో పడేయడం వంటి పనులు చేయవద్దని రెజ్లర్లను కోరారు. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల, త్యాగాల ఫలితంగా సాధించుకున్న పతకాలను అలా వేయడ సరికాదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనతో తనకు సంబంధం లేదంటూ.. ఆ జట్టులో సభ్యుడైన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ స్పష్టం చేశారు. ఇంకా రెజ్లర్ల సమస్యను పరిష్కరించడానికి అధికారులు కృషి చేస్తున్నారని మాజీ క్రికెటర్‌గా నమ్ముతున్నానని, స్పోర్ట్స్‌ని రాజకీయాలతో కలపకూడదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..