Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: షటిల్ ఆడుతుండగానే ఆగిన చిట్టి గుండె.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం..

Telangana: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షటిల్ ఆడుతున్న ఓ వ్యక్తి హార్ట్‌ అటాక్‌తో అనూహ్యంగా చనిపోయాడు. అతనితో పాటు షటిల్ ఆడుతున్న ఇతర క్రీడాకారులు చెప్పిన వివరాల ప్రకార.. జగిత్యాల జిల్లాకు చెందిన..

Telangana: షటిల్ ఆడుతుండగానే ఆగిన చిట్టి గుండె.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం..
Gangaram(56)
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 02, 2023 | 3:10 PM

Telangana: తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు ఘటనలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం యువకులు, మధ్య వయస్కులు ఒకరిద్దరు ఇలా గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  తాజాగా జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షటిల్ ఆడుతున్న ఓ వ్యక్తి హార్ట్‌ అటాక్‌తో తనువు చాలించాడు. అతనితో పాటు షటిల్ ఆడుతున్న ఇతర క్రీడాకారులు ఈ అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైయ్యారు. జగిత్యాల జిల్లాకు చెందిన గంగారాం అలాయాస్ బూస్ శ్రీను(56) వాకింగ్ అనంతరం క్లబ్‌లో షటిల్ ఆడుతున్నాడు.అంతలోనే ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు. అది గమనించిన అక్కడి క్రీడాకారులు వెంటనే అతనికి సీపీఆర్ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

యువకులు, మధ్య వయస్కులు గుండెపోటు బారినపడకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి తదితరాలు గుండెపోటు ఘటనకు కారణాలుగా విశ్లేషిస్తున్నారు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులున్న వారు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకునేందుకు యోగా, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లను వెంటనే విడిచిపెట్టాలని సలహా ఇస్తున్నారు. కఠిన వ్యాయామం చేసేవారు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేవారు తరచూ తమ గుండెను పరీక్షించుకోవడం మంచిదని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..