Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు.. వందేభారత్ ప్రారంభోత్సవం వాయిదా..

Odisha Train Accident: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో 7 రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. తాత్కాలికంగా రద్దయిన రైళ్లలో..

Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు.. వందేభారత్ ప్రారంభోత్సవం వాయిదా..
Sevareal Trains Canceled Amid Odisha Train Accident
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Jun 03, 2023 | 11:02 AM

Odisha Train Accident: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో 7 రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. తాత్కాలికంగా రద్దయిన రైళ్లలో హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్‌(12837), హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్(12863), హౌరా-చెన్నై మెయిల్‌(12839), హౌరా-సికింద్రాబాద్‌(12703), హౌరా-హైదరాబాద్‌(18045), హౌరా-తిరుపతి(20889), హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్‌(12895), హౌరా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌(20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌(02837) ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మార్గం మళ్లించిన రైళ్లు: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఇంకా ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హౌరా(12840) రైలును జరోలి మీదుగా.. వాస్కోడగామా-షాలిమార్‌(18048), సికింద్రాబాద్‌-షాలిమార్‌(22850) వీకెండ్ రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గోవా-ముంబై వందేభారత్‌ ప్రారంభం వాయిదా

మడ్గావ్‌ స్టేషన్‌ నుంచి శనివారం ప్రారంభించదలచిన గోవా-ముంబై వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం శనివారం ఉదయం వర్చ్యువల్ మోడ్‌లో ప్రధాని మోదీ ఈ వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. ఒడిశా  రైలు ప్రమాదం జరిగిన నేపథ్యలో కాంగ్రెస్‌ .జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు చేయూతనివ్వాలని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ ఎంపీ బినయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..