Odisha Train Accident: రైలు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు? హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
క్షతగాత్రుల వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో సహాయక కేంద్రాలు పెట్టారు. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, కర్ణాటకల్లో హెల్ప్ లైన్స్ ద్వారా సమాచారం అందిస్తోంది రైల్వే.

ఊహాకందని విధంగా జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య వందల్లో ఉంది. ఇప్పటివరకు 237 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. నిమిషనిమిషానికీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న క్షతగాత్రుల్లో వందలమంది పరిస్థితి విషమంగా ఉంది. దాంతో, మృతుల సంఖ్య కూడా ఊహించనిస్థాయిలో పెరిగిపోతోంది. స్పాట్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయ్. బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కేయడంతో కోచ్‌ల్లోనే చిక్కుకుపోయారు ప్రయాణికులు. అసలు, ఎంతమంది బోగీల్లో ఇరుక్కుపోయారో కూడా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. ఒక్కో కోచ్‌ను పక్కకు తొలగిస్తూ ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ టీమ్స్. క్షతగాత్రుల వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో సహాయక కేంద్రాలు పెట్టారు. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, కర్ణాటకల్లో హెల్ప్ లైన్స్ ద్వారా సమాచారం అందిస్తోంది రైల్వే.
హెల్ప్ లైన్ నంబర్లు
- ఒడిషా ప్రభుత్వం: 06782-262286
- హౌరా: 033-26382217
- ఖరగ్‌పూర్: 8972073925
- బాలేశ్వర్: 8249591559
- చెన్నై: 044-25330952
- విశాఖ: 08912 746330, 08912 744619
- విజయనగరం: 08922-221202, 08922-221206
- విజయవాడ: 0866 2576924
- రాజమండ్రి: 0883 2420541
- రేణిగుంట: 9949198414
- సికింద్రాబాద్: 040 27788516
- తిరుపతి: 7815915571
- నెల్లూరు: 08612342028




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




