Ponniyin Selvan 2: ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ 2.. ఇక పై ఫ్రీగా చూసేయచ్చు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మే 26 నుంచి పొన్నియన్ సెల్వన్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటివరకు రెంటల్ సర్వీస్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ నిబంధనను ఎత్తివేసింది. ఇకపై అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరూ పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను ఉచితంగా చూడొచ్చు.

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టుగా రూపొందిన చిత్రం పొన్నియన్ సెల్వన్. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది మొదటి భాగం విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. సుమారు రూ. 600 కోట్ల వరకు వసూళ్ల వచ్చాయి. ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ అందుకుంది. ఇక ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 గ్రాండ్‌గా రిలీజైంది. దీనికి మొదటి పార్ట్ కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓటీటీలోనూ ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మే 26 నుంచి పొన్నియన్ సెల్వన్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటివరకు రెంటల్ సర్వీస్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ నిబంధనను ఎత్తివేసింది. ఇకపై అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరూ పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉన్నట్లు ఇందులో తెలిపింది.
కాగా పొన్నియన్ సెల్వన్ 2 డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ దాదాపు 120 కోట్లకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్-2 లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్న స్వరకర్త ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో పొన్నియన్ సెల్వన్ 2 ను మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.




step into the world of grandeur and intrigue as this epic saga continues! ?#PS2onPrime, watch now Available in Tamil, Telugu, Kannada and Malayalamhttps://t.co/6lYhjbXDZJ pic.twitter.com/DTUFwPQRky
— prime video IN (@PrimeVideoIN) June 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.