Ugram OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఉగ్రం మూవీ.. అల్లరోడి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఎక్కడ చూడొచ్చంటే?

కామెడీ పాత్రలకు కేరాఫ్‌గా మారిన అల్లరి నరేష్‌ నాంది, మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో కొత్త పంథాలో వెళుతున్నాడు. సీరియస్‌ రోల్స్‌లోనూ అదరగొడుతున్నాడు. అలా ఇటీవల ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాందితో అల్లరోడికి మర్చిపోలేని హిట్‌ ఇచ్చిన విజయ్‌కనకమేడల ఈ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌కు దర్శకత్వం అందించారు.

Ugram OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఉగ్రం మూవీ.. అల్లరోడి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఎక్కడ చూడొచ్చంటే?
Allari Naresh's Ugram
Follow us

|

Updated on: Jun 02, 2023 | 2:01 PM

కామెడీ పాత్రలకు కేరాఫ్‌గా మారిన అల్లరి నరేష్‌ నాంది, మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో కొత్త పంథాలో వెళుతున్నాడు. సీరియస్‌ రోల్స్‌లోనూ అదరగొడుతున్నాడు. అలా ఇటీవల ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాందితో అల్లరోడికి మర్చిపోలేని హిట్‌ ఇచ్చిన విజయ్‌కనకమేడల ఈ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌కు దర్శకత్వం అందించారు. మిర్నా హీరోయిన్‌గా నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఉగ్రం మే 5న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరోసారి సీరియస్‌ రోల్‌లో నరేష్‌ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీసర్ రోల్‌లో అల్లరోడి నటనకు ప్రశంసలు వచ్చాయి. కథ, కథనాలు కూడా బాగుండడంతో సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్లలో అలరించిన ఉగ్రం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అల్లరి నరేష్ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిన్న (జూన్ 01) అర్ధరాత్రి నుంచే అమెజాన్‌ ప్రైమ్‌లో ఉగ్రం స్ట్రీమింగ్ అవుతోంది. శివకుమార్‌ (నరేష్) అనే ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కుటుంబాన్ని కారు ప్రమాదం చిన్నాభిన్నం చేస్తుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత అతని భార్య, కూతురు కనిపించకుండా పోతారు. వాళ్లను వెతికి పట్టుకునేందుకు అతడు చేసిన ప్రయాణం.. ఈ క్రమంలోనే ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? తన భార్య, బిడ్డతో పాటు నగరంలో కనిపించకుండా పోయిన అనేక మంది ఆచూకీని తనెలా కనుగొన్నాడు? అనేది కథ. మరి ఉగ్రం మూవీని థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో నేరుగా ఇంట్లోనే చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..