CM KCR: ‘బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యం’.. నాగర్‌కర్నూల్ సభలో సీఎం కేసీఆర్..

CM KCR: ధరణిలో 99 శాతం సమస్యలు పూర్తయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్ట‌రేట్, ఎస్‌పీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య ప్రారంభం వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అనంత‌రం..

CM KCR: ‘బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యం’.. నాగర్‌కర్నూల్ సభలో సీఎం కేసీఆర్..
CM KCR in Nagarkurnool Public meet
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: Jun 07, 2023 | 3:58 PM

CM KCR: ధరణిలో 99 శాతం సమస్యలు పూర్తయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే రైతు రాజ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్ట‌రేట్, ఎస్‌పీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య ప్రారంభం వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ‘ఒక‌ప్పుడు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఎక్క‌డ చూసినా గంజి కేంద్రాలే ఉండేవి.. ఇప్పుడు ఆ గంజి కేంద్రాలు మాయం అయ్యాయి.. పంట‌ల కొనుగోలు కేంద్రాలు ప్ర‌త్య‌క్షం అయ్యాయి. తెలంగాణ రాక‌పోయి ఉంటే నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కాక‌పోయేది. ఎస్పీ, క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలు వ‌చ్చేది కాదు. కానీ ఇప్పుడు అద్భుతంగా ఈ భ‌వ‌న‌నాలు రూపుదిద్దుకున్నాయ’ని అన్నారు.

ఇంకా ‘తెలంగాణ ఉద్య‌మానికి చ‌రిత్ర ఉంది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో చాలా వెనుక‌బాటు త‌నం ఉంది. సాగు, తాగునీటికి , క‌రెంట్‌కు ఇబ్బందులు ఉన్నాయి. ఇవ‌న్నీ అర్థం కావాలంటే పాల‌మూరు ఎంపీగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. జ‌య‌శంక‌ర్ సార్ సూచ‌న మేర‌కు పాల‌మూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఆ రోజు వాస్త‌వంగా పాల‌మూరు జిల్లాలో ఉద్య‌మం బ‌లంగా లేకుండే. కానీ మీరు చూపించిన ఆద‌ర‌ణ‌తో ఎంపీగా గెలిపించారు. ఉద్య‌మ చ‌రిత్ర‌లో పాల‌మూరు జిల్లా పేరు శాశ్వ‌తంగా ఉంటుంది. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించాను. ఈ జిల్లాను ఎప్ప‌టికీ మ‌రిచిపోను’ అని స్థానికి ప్రజానీకానికి సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

అలాగే సాధించుకున్న రాష్ట్రంలో తొమ్మిదేండ్లు గ‌డిచిపోయాయని, గడిిచన కాలంలో ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేసుకుని, అన్ని రంగాల్లో భార‌త‌దేశంలోనే అగ్ర‌భాగానా ముందు వ‌రుస‌లో ఉన్నామని పేర్కొన్నారు. త‌ల‌స‌రి ఆదాయంలో మ‌న‌మే నంబ‌ర్ వ‌న్ అన్నారు. ఇంకా ‘అణగారిని ద‌ళిత జాతిని ఉద్ద‌రించాల‌నే ఉద్దేశంతో ఎక్క‌డా లేని విధంగా కుటుంబానికి 10 ల‌క్ష‌లు ఇచ్చి ద‌ళిత‌బంధు ద్వారా ఆదుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఒక నాడు ముంబై బ‌స్సుల‌కు ఆల‌వాలం పాల‌మూరు. గంజి కేంద్రాలు వెలిసేవి. పాల‌మూరులో ఈ గంజి కేంద్రాలు ఏంట‌ని ఏడ్చేవాళ్లం. గంజి కేంద్రాల పాల‌మూరు జిల్లాలో అవి మాయ‌మ‌య్యాయి. పంట కొనుగోలు కేంద్రాలు వ‌చ్చేశాయి. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజ‌యం ఇది’ అని ధీమాగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అదే విధంగా ‘కేసీఆర్ రాక‌ముందు ఇక్క‌డ్నుంచి మంత్రులు ఉన్నారు. కానీ మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేదు. పాల‌మూరును ద‌త్త‌త‌ను తీసుకున్నారు. క‌నీసం మంచినీళ్లు ఇవ్వ‌లేక‌పోయారు. ఈ రోజు బ్ర‌హ్మాండంగా మిష‌న్ భ‌గీర‌థ ద్వారా కృష్ణా నీళ్లు దుంకుతున్నాయి. ఐదు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. నాగ‌ర్‌క‌ర్నూల్ మెడిక‌ల్ కాలేజీకి ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర ఉంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వ‌న‌ప‌ర్తికి మంజూరు చేయ‌గానే మీ ఎమ్మెల్యే నా ద‌గ్గ‌రికి వ‌చ్చి మెడిక‌ల్ కాలేజీ కోరిండు. అప్పుడే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి.. మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేయించాం. ఐదు మెడిక‌ల్ కాలేజీలు పాల‌మూరు జిల్లాకు వస్తాయ‌ని క‌ల‌గ‌న్న‌మా..?’ అంటూ కేసీఆర్ ప్ర‌శ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? మీకో గుడ్ న్యూస్..
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? మీకో గుడ్ న్యూస్..
వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
అర్దరాత్రి ఆ స్టార్ నటుడు నా గది తలుపులు తట్టాడు.. మల్లికా
అర్దరాత్రి ఆ స్టార్ నటుడు నా గది తలుపులు తట్టాడు.. మల్లికా
ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? అనువైన బడ్జెట్లో ఇవే బెస్ట్..
ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? అనువైన బడ్జెట్లో ఇవే బెస్ట్..
స్మార్ట్‌ ఫోన్ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ ఫోన్‌పై తగ్గిన ధర..
స్మార్ట్‌ ఫోన్ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ ఫోన్‌పై తగ్గిన ధర..
కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజ..
కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజ..
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి గుడ్ న్యూస్.. రూ. 20వేలు తగ్గింపు
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి గుడ్ న్యూస్.. రూ. 20వేలు తగ్గింపు
హైడ్రాకు పుల్ పవర్స్.. ఇక ఎవరూ ఆపలేరు..!
హైడ్రాకు పుల్ పవర్స్.. ఇక ఎవరూ ఆపలేరు..!
యూరిక్ యాసిడ్ పెరగిందా లేదా రక్త పరీక్ష లేకుండా ఎలా తెలుస్తుందంటే
యూరిక్ యాసిడ్ పెరగిందా లేదా రక్త పరీక్ష లేకుండా ఎలా తెలుస్తుందంటే
వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు.. రూ. 15వేలకే టాప్ బ్రాండ్ మెషీన్లు
వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు.. రూ. 15వేలకే టాప్ బ్రాండ్ మెషీన్లు
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..