AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు..

Fish Prasadam Distribution: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు..
Fish Prasadam
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2023 | 8:21 PM

Share

Fish Prasadam Distribution: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ నెల 9వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. రెండు రోజుల పాటు చేప ప్రసాదం ఇవ్వనున్నారు. అయితే, చేప ప్రసాదం కోసం మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్న హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారితో మంత్రి తలసాని మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని, అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర ఏర్పాట్లు చేసేదని, దాంతో చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బత్తిన హరినాద్ గౌడ్ కుటుంబ సభ్యులు 250 మంది చేప ప్రసాదం పంపిణీ చేస్తారని చెప్పారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు చెప్పారు. అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన బారీకేడ్ లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో సరిపడా త్రాగునీటిని అందుబాటులో ఉంచుతామని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా GHMC పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాపిక్ మళ్ళించడం జరుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు తో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. RTC ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఇక్కడకు వచ్చే వారికి బద్రి విశాల్ పిట్టి, శ్రీకృష్ణ సమితి, అగర్ వాల్ సమాజ్ వంటి పలు స్వచ్చంద సంస్థలు అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తాయని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..