TSWREIS Inter Admissions 2023: తెలంగాణ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంత్సరంలో ప్రవేశాలు దరఖాస్తులు కోరుతోంది. అడ్మిషన్లు పొందగోరే విద్యార్ధులు జూన్ 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంత్సరంలో ప్రవేశాలు దరఖాస్తులు కోరుతోంది. అడ్మిషన్లు పొందగోరే విద్యార్ధులు జూన్ 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు పంపాలని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తుకు అర్హులు. ఐతే రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చెల్లించాలని సూచించారు.
మరోవైపు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ- ఎకనామిక్స్ కోర్సు(ఆంగ్ల మాధ్యమం) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం సీట్లు 40. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూన్ 12వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1(కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్) జూన్ 18న నిర్వహిస్తారు. హాల్ టికెట్లు జూన్ 14న విడుదల అవుతుంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.