TSPSC Group 1 Exam: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్, ఈడీ దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు తేలేంత వరకూ పరీక్షను నిర్వహించరాదని కోరుతూ గతంలో..

TSPSC Group 1 Exam: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
Telangana High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2023 | 9:00 PM

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్, ఈడీ దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు తేలేంత వరకూ పరీక్షను నిర్వహించరాదని కోరుతూ గతంలో ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిటషన్లు దాఖలు చేయగా.. వాటిని కోర్టు తొసిపుచ్చింది. తాజాగా రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ఎస్‌ మురళీధర్‌రెడ్డి మరోమారు పిటిషన్‌ దాఖలు చేశాడు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ పిటిషనర్‌ పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పి మాధవీదేవి మంగళవారం (జూన్‌ 6) విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగుతుండగా టీఎస్స్‌పీఎస్సీ పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు గైర్హాజరైనవారిని జూన్ 11న నిర్వహించే పరీక్షకు అనుమతించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అలాగే ఆ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని కోరారు. తర్వాత టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే ఒక పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని, దీనిపై దర్యాప్తు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించినట్లు తెలిపారు. ఇరువురి వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే