Telangana: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రేపట్నుంచి తిరిగి తెరచుకోనున్న రేషన్‌ షాపులు! 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా రేషన్‌ డీలర్లు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె చేపట్టారు. డీలర్లు ఎవరైనా చనిపోతే వారి..

Telangana: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రేపట్నుంచి తిరిగి తెరచుకోనున్న రేషన్‌ షాపులు! 
Telangana Ration Dealers
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2023 | 7:59 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా రేషన్‌ డీలర్లు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె చేపట్టారు. డీలర్లు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకే రేషన్ షాప్‌ని కేటాయించాలని డీలర్లు డిమాండ్ చేశారు. ప్రతి రేషన్‌ డీలర్‌కు పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, కనీస గౌరవ వేతనంగా 30 వేలు, ఆరోగ్య కార్డుల పంపిణీ, శాశ్వత ప్రాతిపదికతో రేషన్ డీలర్ షిప్‌ కేటాయింపులను డీలర్లు డిమాండ్ చేశారు.

సమ్మె నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్లతో సచివాలయంలో చర్చలు జరపడంతో డీలర్లు సమ్మె విరమించారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్‌ షాపులు తెరుచుకోనున్నాయి.

మరోవైపు రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సందించారు. డీలర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం వల్లనే సమ్మేబాట పట్టారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిథుల మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వ సొంతానికి వాడుకుంటోందని, రేషన్‌ డీలర్లను నిర్లక్ష్యం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.