సినీఫక్కీలో పట్టపగలే లూటీ..! పోలీసుల్లా నటించి 14 కోట్ల విలువైన బంగారాభరణాలు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా

సినీ ఫక్కీలో ఓ దొంగల ముఠా పట్టపగలే పోలీసుల వేషంలో వచ్చి దర్జాగా బంగారు నగల షాపును దోచుకెళ్లారు. కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చక్కగా మూటగట్టుకుని ఊడాయించారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం (జూన్ 4) మధ్యాహ్నం ఈ షాకింగ్‌ ఘటన చోటు..

సినీఫక్కీలో పట్టపగలే లూటీ..! పోలీసుల్లా నటించి 14 కోట్ల విలువైన బంగారాభరణాలు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా
Maharashtra Jewellery Shop Robbery
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2023 | 6:18 PM

కొల్హాపూర్‌: సినీ ఫక్కీలో ఓ దొంగల ముఠా పట్టపగలే పోలీసుల వేషంలో వచ్చి దర్జాగా బంగారు నగల షాపును దోచుకెళ్లారు. కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చక్కగా మూటగట్టుకుని ఊడాయించారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం (జూన్ 4) మధ్యాహ్నం ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సాంగ్లీలోని రిలయన్స్‌ జ్యువెల్లరీ నగల దుకాణం వద్దకు దాదాపు 8 మంది దొంగలు రెండు కార్లలో వచ్చారు. అనంతరం పోలీసుల్లా వేషాలు మార్చుకుని ఆదివారం మధ్యాహ్నం 2:30 నుంచి 3:00 గంటల ప్రాంతంలో షాప్‌లోకి ప్రవేశించారు. నిజం పోలీసుల్లా నటిస్తూ తుపాకులతో సిబ్బందిని బెదిరించి బందించారు. ఓ వ్యక్తి ప్రతిఘటించగా అతనిపై కాల్పుల జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల ధాటికి వ్యక్తికి గాయాలయ్యాయని, దుకాణంలోని అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. అనంతరం బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని చెప్పారు.

సమాచారం అందుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించి జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. షాప్‌లో 70 శాతం నగలను మూట కట్టుకెళ్లారు. మొత్తం14 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..