AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కారు ప్రమాదంలో ప్రముఖ బుల్లితెర నటుడు దుర్మరణం

ప్రముఖ బుల్లితెర నటుడు కొల్లం సుధి (39) సోమవారం కారు యాక్సిడెంట్‌లో దుర్మరణం చెందారు. ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో కేరళలోని త్రిసూర్‌లో కైపమంగళం వద్ద సుధి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కారు ప్రమాదంలో ప్రముఖ బుల్లితెర నటుడు దుర్మరణం
Kollam Sudhi
Srilakshmi C
|

Updated on: Jun 05, 2023 | 3:06 PM

Share

ప్రముఖ బుల్లితెర నటుడు కొల్లం సుధి (39) సోమవారం కారు యాక్సిడెంట్‌లో దుర్మరణం చెందారు. ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో కేరళలోని త్రిసూర్‌లో కైపమంగళం వద్ద సుధి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నటుడు కళాభవన్ షాజోన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ ద్వారా  ఈ విషయాన్ని వెల్లడించారు. కారు ప్రమాదానికి గురైన సమయంలో సుధితోపాటు మరో ముగ్గురు కూడా వాహనంలో ఉన్నారు. వారిని ఉల్లాస్ అరూర్, బిను ఆదిమాలి, మహేష్‌గా పోలీసులు గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీ కొనడం వల్ల ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో మలయాళీ నటుడు సుధి ప్రాణాలు కోల్పోగా, మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమచారం. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Aju Varghese (@ajuvarghese)

కాగా కొల్లమ్‌ సుధి పలు టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు మళయాల సినిమాల్లో కూడా ఆయన నటించారు. మలయాళ హాస్యనటుడు మాముక్కోయా (77) గత ఏప్రిల్‌ నెలలో గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇంతలో మరో నటుడు కన్నుమూయడంతో మళయాళ చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.