Telangana: అనారోగ్యంతో మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి..!
సీపీఐ మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అనార్యోగంతో మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ మే 31న గుండె పోటుతో మృతిచెందినట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి..
హైదరాబాద్: సీపీఐ మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అనార్యోగంతో మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ మే 31న గుండె పోటుతో మృతిచెందినట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆదివారం ఉదయం మీడియా ద్వారా ప్రకటించారు.
కాగా, కటకం సుదర్శన్ బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి. వరంగల్ పాటిటెక్నిక్ కోర్స్‌ను అభ్యసించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దోపిడీకి గురవుతున్న ఆదివాసీల హక్కుల కోసం పోరాడేందుకు నక్సల్‌లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 1978 సుదర్శన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2011 నవంబర్‌లో కిషన్‌జీని హతమార్చిన తర్వాత దాదాపు 14 మంది సభ్యులతో పొలిటికల్ బ్యూరోకు నాయకుడిగా వ్యవహరించారు.
ఏపీ, తెలంగాణ నక్సల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీలోనే సాధన అనే మహిళను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలం క్రితం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మరణించారు. 2011 చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ మారణకాండలో ప్రధాన సూత్రదారి. సుదర్శన్‌పై 21 కేసులు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.