Hyderabad: ట్యాంక్ బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్! టెకీ మృతి
ట్యాంక్ బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రోడ్డుపై వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేసేక్రమంలో ట్రావెల్ బస్సు వేగంగా బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌ఫై ప్రయానిస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి..
హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రోడ్డుపై వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేసేక్రమంలో ట్రావెల్ బస్సు వేగంగా బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌ఫై ప్రయానిస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ శివారులోని ఆలియాబాద్‌లో లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతని పెద్ద కుమారుడు మనోజ్ కుమార్ హైటెక్ సిటీలోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నైట్ షిప్ట్ కావడంతో రాత్రి విధులు ముగించుకుని ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ మీదుగా బైక్ పై వెళుతున్న మనోజ్‌ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి బైక్‌ను బలంగా ‘ఢీ’ కొట్టింది. ప్రమాదంలో మనోజ్ కిందపడిపోగా అతనిపై నుంచి బస్సు వెళ్లింది. దీంతో మనోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మనోజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆఫీస్‌కు వెళ్లి కొడుకు ఇలా చనిపోయి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.