Honour Killing: ‘ప్రేమించిందనీ..’ కన్న తల్లీదండ్రులే హతమార్చి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ
రువు తక్కువ పని చేసిందని కన్న కూతురిని స్వయంగా తల్లిదండ్రులే కడతేర్చారు. ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లిందని గొంగు నొక్కేశారు. ఆనక ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోస్టుమార్టం నిమిత్తంలో అసలు విషయం బయటపడింది. పది రోజుల తర్వాత పోలీసులు అరెస్టు చేసి..
లక్నో: పరువు తక్కువ పని చేసిందని కన్న కూతురిని స్వయంగా తల్లిదండ్రులే కడతేర్చారు. ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లిందని గొంగు నొక్కేశారు. ఆనక ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోస్టుమార్టం నిమిత్తంలో అసలు విషయం బయటపడింది. పది రోజుల తర్వాత పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక (16) తన గ్రామంలోని ఓ అబ్బాయిని ఏడాది కాలంగా ప్రేమిస్తోంది. తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను పలుమార్లు హెచ్చరించారు. బయటికి వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. తీరుమార్చుకోని బాలిక తల్లిదండ్రుల కళ్లుగప్పి బయటికి వెళ్లి ప్రియున్ని కలిసేది. అయినప్పటికీ బాలిక.. ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లింది. ఈ క్రమంలో గత నెల 24న కూడా తల్లిదండ్రులకు తెలియకుండా బయటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను చితకబాదారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వంటగదిలో తాడుతో బాలికకు ఉరివేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు.
ఆ తర్వాత తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పైగా బాలిక మృత దేహంపై మూడు చోట్ల బలమైన గాయాలు కనిపించాయి. చివరికి తల్లిదండ్రులే ఆ పని చేసినట్లు తేలడంతో వారిని అరెస్టు చేసినట్లు ఉల్దాన్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ నగేష్ సింగ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.