Odisha Train Accident: జాడ లేదు.. ఫోన్లు స్విచ్ఛాఫ్.. రైలు ప్రమాదంలో 100 మందికి పైగా ఆచూకీ గల్లంతు..!

Odisha train accident news: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందారు. 1175 మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో 793 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Odisha Train Accident: జాడ లేదు.. ఫోన్లు స్విచ్ఛాఫ్.. రైలు ప్రమాదంలో 100 మందికి పైగా ఆచూకీ గల్లంతు..!
Odisha Train Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 04, 2023 | 8:34 AM

Odisha train accident news: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందారు. 1175 మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో 793 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఆస్పత్రుల్లో 382 మందికి చికిత్స అందుతోంది. అయితే, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఘటనాస్థలంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మరో మూడు రోజులపాటు సహాయక చర్యలు కొనసాగనున్నాయి. ఈ తరుణంలో ఒడిశా రైలు ప్రమాదంలో తెలుగు ప్రయాణికుల లెక్కపై గందరగోళం కొనసాగుతోంది. అసలా రెండు రైళ్లు ఎక్కిన తెలుగువాళ్లు ఎంతమంది?. ప్రాణాలు కోల్పోయింది ఎందరు?. ఆచూకీ దొరకనివాళ్లు వాళ్లెంతమంది?. గాయపడింది ఎందరు?. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లిపోయింది ఎంతమంది? ఈ లెక్కపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది.

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482మంది తెలుగువాళ్లు ఎక్కినట్టు ప్రాథమిక ఆధారాలు దొరికాయ్‌. ఇందులో 267మంది సేఫ్‌గా బయటపడ్డారు. మరి, మిగతా 113మంది ఏమైపోయినట్టు?. జనరల్‌ బోగీల్లో ఎక్కిన తెలుగువాళ్లు ఎంతమంది?. ఈ లెక్కే తేలడం లేదు. మిస్సైన ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో బంధువుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది.

ఇక హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 89మంది తెలుగువాళ్లు ప్రయాణిస్తే, అందులో 49మంది క్షేమంగా ఉన్నట్టు తేలింది. ఇంకా 28మంది ఆచూకీపై గందరగోళం కొనసాగుతోంది. వీళ్లు ఏమైయ్యారో ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ అధికారులు.

ఇవి కూడా చదవండి

అన్‌ రిజర్వడ్‌ ప్రయాణికులపై కూడా అస్పష్టత సమాచారం మాత్రమే అందుతోంది. జనరల్‌ బోగీల్లో మరో 50మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్‌ కేటగిరీలో ట్రేస్‌కాని 21మంది తెలుగువాళ్లు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..