Rajasthan Rains: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వందేళ్ల తర్వాత రాజస్థాన్‌లో తొలిసారి రికార్డు స్థాయిలో వాన
ఎడారి రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. రాజస్థాన్‌లో ఈ ఏడాది మేలో నెలలో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 100 ఏళ్లలో అత్యధికంగా మే నెలలోనే అత్యధికంగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ..
జైపూర్: ఎడారి రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. రాజస్థాన్‌లో ఈ ఏడాది మేలో నెలలో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 100 ఏళ్లలో అత్యధికంగా మే నెలలోనే అత్యధికంగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ నిన్న ( గురువారం ) వెల్లడించింది.
సాధారణంగా రాజస్థాన్ రాష్ట్రంలో మే సగటున 13.6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఐతే ఈ ఏడాది వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, అకాల వర్షపాతం, ఇతర కారణాల వల్ల మొత్తం 62.4 మిల్లి మీటర్ల వర్షం కురిసింది. దీంతో గత 100 ఏళ్లలో తొలిసారి అత్యధిక వర్షపాతం మే నెలలో నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. 1917 మేలో రాజస్థాన్‌లో తొలిసారి 71.9 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు రాష్ట్రంలోని బికనీర్, జోధ్‌పూర్, అజ్మీర్, జైపూర్, భరత్‌పూర్ డివిజన్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 6 వరకు అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 7, 8 తేదీల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.