IBPS RRB Recruitment 2023: రూరల్ బ్యాంకుల్లో 8,594 ఉద్యోగాలకు ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌.. 8,594 క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌-2023 విడుదల..

IBPS RRB Recruitment 2023: రూరల్ బ్యాంకుల్లో 8,594 ఉద్యోగాలకు ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల
IBPS RRB Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 01, 2023 | 1:23 PM

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌.. 8,594 క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌-2023 విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో ఈ నియామకాలను చేపట్టనుంది. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను ఐబీపీఎస్‌ భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులను గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్ (స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టుల కింద వర్గీకరించారు.

ఆయా పోస్టుకలు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 21, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి దరఖాస్తు విధానం ప్రారంభమైంది.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు రూ.850లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులు రూ.175లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.  రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 1, 2023.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులక చివరి తేదీ: జూన్‌ 21, 2023.
  • ప్రిలిమినరీ పరీక్షకు హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌ తేదీ: డిసెంబర్ 2022.
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు 2023లో
  • ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: సెప్టెంబర్‌ 2023లో
  • ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 2023లో
  • ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: అక్టోబర్‌ 2023లో
  • ఇంటర్వ్యూ నిర్వహణ: అక్టోబర్‌/నవంబర్‌ 2023లో
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: జనవరి 2024లో

రాత పరీక్ష విధానం..

ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు 125 మార్కులకు 2 గంటల సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌లో 50 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెయిన్‌ పరీక్ష 60 ప్రశ్నలకు 60 మార్కులకు 45 నిముషాల్లో పరీక్ష జరుగుతుంది. మెయిన పరీక్షలో షార్ట్‌లిస్టింగ్‌ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?