Andhra Pradesh: నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి భేటీ
ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి గురువారం (జూన్ 1) భేటీ కానున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సీఎస్ క్యాంప్ కార్యాలయంలో సమావేశంకానున్నారు. ఉద్యోగాల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సీఎస్ ఆహ్వానం పంపినట్లు..
అమరావతి: ఇవాళ్టి సీఎస్ భేటీలో ఉద్యోగుల సమస్యలు కొలిక్కి వస్తుందా?. ఏఏ అంశాలు చర్చకు వస్తాయి? సీఎస్ భేటీపై బొప్పరాజు ఏమన్నారో.. ఈ విషయాలను ఓసారి పరిశీలిద్దాం..
ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి గురువారం (జూన్ 1) భేటీ కానున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సీఎస్ క్యాంప్ కార్యాలయంలో సమావేశంకానున్నారు. ఉద్యోగాల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సీఎస్ ఆహ్వానం పంపినట్లు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏపి జెఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున హాజరవుతున్నట్లు చెప్పారు. తమ జేఏసీ తరపున ఫిభ్రవరి 13న సియస్‌కి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలోని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆహ్వానించారని తెలియజేశారు బొప్పరాజు. గత 84 రోజులుగా చేస్తున్న ఉద్యమం కొనసాగుతుందని.. ఉద్యమాన్ని చులకనగా చూస్తే ఉద్యమం తమ చేతుల్తో ఉండదని హెచ్చరించారు బొప్పరాజు.
గుంటూరులో జూన్ 8న ఏపీజేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. సదస్సుకు సంబందించిన పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చిందని.. ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదని బొప్పరాజు తెలిపారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.