‘ఇప్పుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదు..’ రజనీ సోదరుడు వైరల్ కామెంట్స్
తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ నటన, ఆకట్టుకునే స్టైల్ అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అటు అభిమానులు, ఇటు రాజకీయవేత్తలు..

తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ నటన, ఆకట్టుకునే స్టైల్ అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అటు అభిమానులు, ఇటు రాజకీయవేత్తలు కోరుకుంటున్నా మొదట్నుంచి సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించడం లేదనే కారణంతో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ రాజకీయాల్లోకి రావాలనే అభిమానుల కోరిక అడుగున పడిపోయింది. రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఆయన సోదరుడు సత్యనారాయణ రావు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ఉపయోగం లేదని అన్నారు. ఇందుకు కారణం రజనీకాంత్ ఏడు పదులు దాటడమేనని పేర్కొన్నారు. ఆయన ఎవరికీ మద్దతు పలికే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో సుదీర్ఘకాలం జీవించాలని దేవుడిని కోరుకుంటున్నానని’ సోదరుడు సత్యనారాయణ ఆకాంక్షించారు. సత్యనారాయణ సోమవారం తిరుచెందూర్ కుమారస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ నటిస్తున్న జైలర్, లాల్ సలాం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లాల్ సలాం మువీలో సూపర్ స్టార్ రజనీ అతిథి పాత్రలో కనిపించనున్నారు.




మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.