AP Latest Weather Report: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం..!
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు..
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు చేశారు. పిడుగుల పడే జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండరాదని సూచించారు. అత్యవసరమైతేతప్ప బయటికి రావద్దని హెచ్చరించారు.
దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.