AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లోక్‌సభ డిలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం.. రాజకీయాలకు అతీతంగా మనమంతా గళమెత్తాలి’ మంత్రి కేటీఆర్

లోక్ సభ డిలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అధిక జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పంపకం పట్ల కేటీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

'లోక్‌సభ డిలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం.. రాజకీయాలకు అతీతంగా మనమంతా గళమెత్తాలి' మంత్రి కేటీఆర్
Minister KTR
Srilakshmi C
|

Updated on: May 30, 2023 | 11:00 AM

Share

లోక్ సభ డిలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అధిక జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పంపకం పట్ల కేటీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు, జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతోంది. వాటిని నమ్మి జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉంది. 2026 తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ జరగనుంది. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న మన దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ నూతన డిలిమిటేషన్ వలన తక్కువ లోక్ సభ స్థానాలు పొందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం లోక్ సభ సీట్ల పెంపులో లబ్ధి పొందడం దురదృష్టకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఇంకా ఆయన ఇలా మాట్లాడారు..’ ప్రగతిశీల విధానాలను పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు శిక్షించబడటం అన్యాయం, బాధాకరం. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35% జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయి. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్ సభ డిలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదు. ప్రగతిశీల విధానాలకు లబ్ధి పొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణి వనిపించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు గళమెత్తాలని’ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.