Amit Shah Manipur Visit: మణిపూర్‌లో ‘షా’ 4 రోజుల పర్యటన.. తొలిరోజు గవర్నర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌తో బేఠీ
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 4 రోజులపాటు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు. అమిత్‌షా పర్యటిస్తున్నారు. మే 29న మణిపుర్‌కు చేరుకున్న షా జూన్1 వరకు ఇక్కడే..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 4 రోజులపాటు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు. అమిత్‌షా పర్యటిస్తున్నారు. మే 29న మణిపుర్‌కు చేరుకున్న షా జూన్1 వరకు ఇక్కడే ఉండనున్నారు. మణిపూర్‌లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా సోమవారం గవర్నర్ అనుసూయా ఉయికే, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకాతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి, శాంతిభద్రతలు కాపాడటానికి, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి వ్యూహాలను రూపొందించే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
మే 3న జాతి ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో షా తొలి పర్యటన కావడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో మణిపుర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంది. ఆదివారం భద్రతాదళాలు, వేర్పాటు వాదుల మధ్య జరిగిన ఘర్షణల్లో పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారు.
Posters welcoming Union Home Minister Amit Shah seen in different parts of Manipur ahead of his arrival later today in Imphal pic.twitter.com/CRhINpoDl1
— ANI (@ANI) May 29, 2023
మణిపూర్ రాష్ట్రంలో ఎస్టీ హోదా కోసం గత కొంత కాలంగా నిరసనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మెయిటీలు, కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఈ ఘర్షణ అనతికాలంలోనే తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా కనీసం 70 మందికిపైగా మృతి చెందారు. వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితులను అదుపు చేసేందుకు భారత ఆర్మీతోపాటు అసోం రైఫిల్స్ పెద్ద సంఖ్యలో మోహరించాయి.