‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’.. భర్తకు విడాకులిచ్చి మరో యువతిని వివాహం చేసుకున్న మహిళ.. !

ఓ భార్య తన భర్తకు విడాకులిచ్చి.. తన స్నేహితురాలని పెళ్లాడింది. ఇద్దరు మహిళలు గుడిలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకొని దంపతులుగా మారారు. దీంతో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడంపై సుప్రీం కోర్టులో..

'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు'.. భర్తకు విడాకులిచ్చి మరో యువతిని వివాహం చేసుకున్న మహిళ.. !
Lesbian Marriage
Follow us

|

Updated on: May 29, 2023 | 11:06 AM

ఓ భార్య తన భర్తకు విడాకులిచ్చి.. తన స్నేహితురాలని పెళ్లాడింది. ఇద్దరు మహిళలు గుడిలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకొని దంపతులుగా మారారు. దీంతో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడంపై సుప్రీం కోర్టులో తీర్పు వెలువడక ముందే పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

పశ్చిమ బెంగాల్‌కు చెందని మౌసుమి దత్తా, మౌమిత అనే ఇద్దరు మహిళలు గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐతే మౌసుమి దత్తా అనే మహిళకు ఇప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో మౌసుమీ పిల్లలను తన పిల్లలుగా స్వీకరించేందుకు మౌమిత అంగీకరించింది. దీంతో మౌసుమి తన భర్తకు విడాకులిచ్చి చింఘిఘాట్‌లోని బగ్దర్‌లోని భూతనాథ్ ఆలయంలో ఆదివారం (మే 28) మౌమితను వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా మౌసుమి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త తనను రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అందుకే తన భర్త నుంచి విడిపోయానని చెప్పుకొచ్చింది.

మరోవైపు మౌమిత మాట్లాడుతూ.. ‘ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య మాత్రమేనా? ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషుల మధ్యలో కూడా ప్రేమ చిగురిస్తుందని, వారు కలిసి ఉండగలరు. మౌసుమిని వివాహం చేసుకోవడం మా కుటుంబానికి ఇష్టం లేకపోవడంతో మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. జీవితాంతం తనతో కలిసే ఉంటానని ప్రమాణం చేశాను. మౌసుమిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోనని ప్రమాణం చేశాను. అందుకే నా ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని’ మౌమిత తెల్పింది. సంప్రదాయాన్ని ఉల్లంఘించి పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ ఇద్దరు మహిళల వింతగాథ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక