AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. GSLV-F12 రాకెట్ ప్రయోగం సక్సెస్‌ఫుల్..

GSLV F-12 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తోంది. 2వేల 232 కిలోల బరువుతో NVS -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్తోంది GSLV. అమెరికా అందిస్తున్న GPS తరహా నేవిగేషన్ కోసం భారత్‌ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం IRNSS నావిక్. అందులో భాగంగానే NVS 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు.

ISRO: ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. GSLV-F12 రాకెట్ ప్రయోగం సక్సెస్‌ఫుల్..
Isro
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2023 | 12:19 PM

Share

GSLV F-12 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 2వేల 232 కిలోల బరువుతో NVS -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది.. ఇస్రో ప్రయోగం సక్సెస్ కావడంతో  శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. అమెరికా అందిస్తున్న GPS తరహా నేవిగేషన్ కోసం భారత్‌ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం IRNSS నావిక్. అందులో భాగంగానే NVS 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.. IRNSS మొత్తం ఏడు ఉపగ్రహాల ప్రయోగం. ఇందులో భాగంగా గతంలో పంపిన నాలుగు ఉపగ్రహాల జీవితకాలం ముగిసింది. సో.. వాటికి కొనసాగింపుగా IRNSS రెండో తరం నేవిగేషన్‌ శాటిలైట్ సిరీస్‌లో ఇప్పుడు పంపుతున్న NVS-1 మొదటిది. మొత్తం ప్రయోగాల ప్రక్రియ మొత్తం ఇప్పటి వరకూ జీపీఎస్‌పై ఆధారపడిన మనం ఇకపై దేశీయ నేవిగేషనల్ సేవలు పొందొచ్చు. భారత రక్షణరంగానికి, పౌర విమానయాన రంగానికి ఇస్రో అభివృద్ధి చేస్తున్న IRNSS ఎంతో మేలు చేయబోతోంది.

IRNSSలో రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లో NVS-1 ఇది మొదటిది. గతంలో నావిగేషన్‌ సర్వీసెస్‌ కోసం పంపిన IRNSS ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ ఎన్‌వీఎస్‌ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.. ఇక ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ సిరీస్‌లో మరిన్ని శాటిలైట్లు ప్రవేశపెడతారు.

ఇవి కూడా చదవండి

ఎల్ఐ బ్యాండ్‌లో కొత్త సేవలను ఈ శాటిలైట్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 2వేల 232 కిలోలు. ఇది భారత ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల మేర రియల్ టైం పొజిషనింగ్ సేవలు అందిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..