TSRTC Route Pass: గ్రేటర్‌ వాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇకపై సాధారణ ప్రయాణికులకూ రూట్‌పాస్‌లు

సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గతంలో కేవలం విద్యార్థులకు మాత్రమే మంజూరు చేసే రూట్‌ పాసులు ఇకపై సాధారణ ప్రయాణికులకూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మే 27 నుంచే నగర ప్రయాణికుల కోసం రూట్‌ పాస్‌లను..

TSRTC Route Pass: గ్రేటర్‌ వాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇకపై సాధారణ ప్రయాణికులకూ రూట్‌పాస్‌లు
TSRTC Route Pass
Follow us

|

Updated on: May 30, 2023 | 12:32 PM

సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గతంలో కేవలం విద్యార్థులకు మాత్రమే మంజూరు చేసే రూట్‌ పాసులు ఇకపై సాధారణ ప్రయాణికులకూ అందుబాటులోకి తీసుకొచ్చింది. మే 27 నుంచే నగర ప్రయాణికుల కోసం రూట్‌ పాస్‌లను అమల్లోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్‌ అధికారులు తెలిపారు. కేవలం రూ.600లకే రూట్‌ పాస్‌లను అందిస్తోంది. ఐతే ఎనిమిది కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. రూట్‌ పాస్‌తో ఒకే రూట్‌లో రోజుకు ఎన్ని సార్లు అయినా ప్రయాణించవచ్చు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రూ.1000లకే రూట్‌పాస్‌ ఇస్తున్నారు.

ఇలా ప్రతీ నెల సగం ధరలకే పాస్‌ పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ యాజమన్యం. ఏ పాసు పొందాలన్నా ఐడీ కార్డు కోసం అదనంగా మరో రూ.50 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ గుర్తించిన 162 రూట్లలో తొలుత ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సుల్లో ఈ అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం నగరంలో దాదాపు 1.50 లక్షల జనరల్‌ బస్‌పాసులు ఉన్నాయి. వాటిలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాసులు 1.25 లక్షలు ఉండగా.. ఆర్డినరీ పాసులు కేవలం 25 వేలు మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో, పల్లె వెలుగులో కలిపి మరో 5000 వేలు ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చిన రూట్‌ పాస్‌ల వల్ల ప్రయాణికులకు మరింత లబ్ది చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇతర వివరాల కోసం tsrtc.telangana.gov.in, online.tsrtcpass.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.